Thangalaan : కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram) నటించిన ‘తంగలాన్’ (Thangalaan) మూవీకి రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత అరుదైన గౌరవం లభించింది. ఈ మూవీని అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నట్టు సమాచారం.
‘తంగలాన్’కు అరుదైన గౌరవం
విక్రమ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘తంగలాన్’ (Thangalaan). కోలార్ గోల్డ్ ఫిల్ల్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ గత ఏడాది ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. రియల్ స్టోరీతో పాటు ఈ మూవీ ఫిక్షనల్ గా ఉండడంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మొత్తానికి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగానే కలెక్షన్లను కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కాబోతోందనే విషయాన్ని డైరెక్టర్ అనౌన్స్ చేశారు.
‘తంగలాన్’ మూవీ నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న రాటర్ డామ్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ (Rotterdam Film Festival 2025) లో డైరెక్టర్ కట్ ప్రదర్శితం కాబోతోందని పా రంజిత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ పోస్ట్ లో “ఈ రోజు IFFR 2025 లో తంగలాన్ డైరెక్టర్స్ కట్ సినిమా, అండ్ అన్ సెన్సార్డ్ వర్షన్ ప్రీమియర్ ను అనౌన్స్ చేయడం గర్వంగా ఉంది. 54వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రాటర్ డామ్ లో భాగంగా ఈ మూవీని ప్రదర్శితం చేయబోతున్నాం. రా అండ్ అన్ కంప్రమైజ్ స్టోరీని ప్రపంచానికి చెప్పినందుకు గౌరవంగా భావిస్తున్నాను.” అంటూ స్పెషల్ పోస్టర్ని వదిలారు.
Proud to announce the World Premiere of “Thangalaan” Director’s Cut—the uncensored vision of the film—today at IFFR 2025! Catch it at Pathé 5 as part of the 54th International Film Festival Rotterdam at 11:00 AM CET. Honored to present this raw and uncompromised storytelling to… pic.twitter.com/pTUVOijVYq
— pa.ranjith (@beemji) February 1, 2025
‘తంగలాన్’ ఏ ఓటీటీలో ఉందంటే?
చియాన్ విక్రమ్, మాళవిక మోహన్, పార్వతి తిరువోతు తదితరులు కీలకపాత్రలు పోషించిన ‘తంగలాన్’ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. కర్ణాటకకు చెందిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో పని చేసే కార్మికుల నిజజీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తంగలాన్, గంగమ్మ ఇద్దరూ భార్య భర్తలు. వేప్పూర్ అనే గ్రామంలో తమకున్న చిన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతారు. పండించిన పంట చేతికి వచ్చే టైంకి జమీందారు మనుషులు వచ్చి తగలబెట్టేస్తారు. పైగా ఉదయాన్నే పన్ను కొట్టలేదనే నెపంతో భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత తంగలాన్ కుటుంబంతో వెట్టి చాకిరీ చేయిస్తాడు జమీందారు.
మరోవైపు బ్రిటిష్ దొర వేప్పూర్ సమీపంలో ఉన్న అడవిలో బంగారు గనులు తవ్వాలని ప్రయత్నించగా, ఎవ్వరూ ఆ పనికి ముందుకు రారు. అయితే అక్కడికి వెళ్లి, దొర ఇచ్చే డబ్బుతో తమ భూమిని విడిపించుకోవచ్చు అన్న ఆలోచనతో తంగలాన్ ఊరివాళ్లను ఒప్పించి వెళ్తాడు. అయితే తంగలాన్ కి తరచూ వచ్చే కలలో ఆరతి అనే మహిళ అతన్ని వెంటాడుతుంది. మరి ఆరతి ఎవరు? ఇంతకీ బంగారాన్ని తవ్వగలిగారా? అనేది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘తంగలాన్’ (Thangalaan) మూవీని చూసి తెలుసుకోవాలి.