BigTV English
Advertisement

Oscar: ఆస్కార్ బరిలో ఇండియన్ డాక్యుమెంటరీ..

Oscar: ఆస్కార్ బరిలో ఇండియన్ డాక్యుమెంటరీ..

Oscar: చలన చిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ఆస్కార్. సినీ రంగంలో అత్యుత్తమ సేవలందించిన సినీనటులు, దర్శకులు ఇతరులకు ఈ అవార్డులను ప్రధానం చేస్తుంటారు. ఈ ఏడాది నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా.. త్వరలోనే అవార్డులను ఇవ్వనున్నారు. ఈసారి భారత్ నుంచి డాక్యుమెంటరీ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్’ పోటీలో ఉంది.


ఆల్ దట్ బ్రీత్:

ఈ డాక్యుమెంటరీని శౌనక్ సేన్ తెరకెక్కించగా.. అమన్ మన్, టెడ్డీ లీఫర్ నిర్మించారు. పర్యావరణ కాలుష్యం, గాలిపటాల వల్ల కలిగే ప్రమాదాల నుంచి బ్లాక్ కైట్స్ అని పిలిచే పక్షులను రక్షించడానికి ఢిల్లీకి చెందిన సోదరులు నదీమ్ షెహజాద్, మహమ్మద్ గౌస్ తమ జీవితాలను అంకితం చేస్తారు. వారి జీవితగాథ ఆధారంగా ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీగా గోల్డెన్ ఐ అవార్డును, సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ జ్యూరీ బహుమతిని గెలుచుకుంది. ఇక ఈ ఏడాది ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది.


ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో నామినేషన్లు అందుకున్న ఇతర చిత్రాలు ఇవే…

ఫైర్ ఆఫ్ లవ్:

శరదోసా తెరకెక్కించిన అమెరికా డాక్యుమొంటరీ ‘ఫైర్ ఆఫ్ లవ్’ కూడా ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఫ్రెంచ్‌కు చెందిన అగ్నిపర్వత శాస్త్రవేత్తలు కాటియా, మారిస్ క్రాఫ్ట్ జీవితాలు, వారి ప్రేమ కథ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జోనాథాన్ ఓపెన్‌హీమ్ ఎడిటింగ్ అవార్డును కూడా అందుకుంది.

ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్పింట్లర్స్:

‘ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్పింటర్ల్’.. ఈ డాక్యుమెంటరీని సైమన్ లెరెంగ్ విల్మోంట్ తెరకెక్కించారు. ఉక్రెయిన్‌లోని అనాశ్రమంలోని పిల్లల సంరక్షణ గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఈ డాక్యుమెంటరీ 2022 జనవరి 26న రిలీజ్ అయింది.

ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్:

ఓ ఫొటోగ్రాఫర్ జీవితగాథ ఆధారంగా లారా పోయిట్రాస్ తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లద్‌షెడ్’. 2022 సెప్టెంబర్ 3న రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీని జాన్ లియోన్స్, యోని గోలిజోవ్, నాన్ గోల్డిన్‌లు నిర్మించారు. 79వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్ అవార్డును ఈ డాక్యుమెంటరీ సొంతం చేసుకుంది.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×