BigTV English

Actor Vijay: కోలీవుడ్ హీరో విజయ్ విడాకులు.. ?

Actor Vijay: కోలీవుడ్ హీరో విజయ్ విడాకులు.. ?

Actor Vijay: ఏంటి.. హీరో విజయ్ కూడా విడాకులు తీసుకుంటున్నాడా.. ? అంటే   నిజమే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ మధ్య ఇండస్ట్రీలో విడాకుల పరంపర నడుస్తున్న విషయం తెల్సిందే.  ఎన్నో ఏళ్లు ప్రేమించుకొని గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న జంటలు..  ముచ్చటగా మూడేళ్లు కూడా  కలిసి ఉండలేక విడిపోతున్నారు. సినిమా రంగంలో ఇలాంటి విడాకుల జంటలు చాలానే ఉన్నాయి.


నిన్నటికి నిన్న జయం రవి సైతం తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే తన భర్త తనకు చెప్పకుండానే విడాకులు ప్రకటించాడని రవి భార్య  ఆర్తి ఆరోపణలు చేయడం గమనార్హం. ఇక   ఈ విడాకుల  ప్రకటనతో కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదే ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అంటే..  మరో స్టార్ హీరో విడాకుల కోసం లైన్లో ఉన్నాడని చెప్పుకొస్తున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. దళపతి విజయ్.

గత కొన్ని రోజులుగా  సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వార్తల్లో విజయ్ విడాకులు కూడా ఒకటి. ప్రస్తుతం విజయ్ సినిమాలకు బ్రేక్ తీసుకొని  రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెల్సిందే. ఈ మధ్యనే అతని చివరి చిత్రం ది గోట్ రిలీజ్ అయ్యి పరాజయాన్ని అందుకుంది.


Thalavan OTT Review: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫ్యాన్స్.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ కావొద్దు

ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్, తన భార్య సంగీతతో విడిపోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారట. కుమారుడుతో కలిసి  సంగీత  ఒక ఇంట్లో ఉంటుండగా.. విజయ్ ఒక్కడే వేరే ఇంట్లో ఉంటున్నట్లు  కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గతంలో  ఇలాంటి వార్తలు వచ్చినా.. సంగీత  ఏదో ఒక విధంగా  ఇవన్నీ  రూమర్స్ అని కొట్టేస్తూ వచ్చింది. కానీ, ఈసారి మాత్రం  ఆమె  నోరు కూడా మెదపడం లేదని టాక్.

ఇక దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని,  త్వరలో ఈ జంట తమ 28 ఏళ్ళ వివాహ బంధానికి చెక్ పెట్టనున్నట్లు  తమిళ్ తంబీలు గుసగుసలాడుకుంటున్నారు.  ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. విజయ్ రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారుతుంది. ఇంటిని, భార్యను చక్కగా చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏం చూసుకుంటాడు అనే విమర్శలు వెల్లువెత్తుతాయి. ఇవన్నీ  తెలిసి విజయ్.. ఇలాంటి సాహసం చేస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×