BigTV English

Minister Nimmala: అది కుట్ర కాకపోతే బోట్లకు లంగరు ఎందుకు వేయలేదు? : మంత్రి నిమ్మల

Minister Nimmala: అది కుట్ర కాకపోతే బోట్లకు లంగరు ఎందుకు వేయలేదు? : మంత్రి నిమ్మల

Minister Nimmala Ramanayudu Comments on Jagan: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. విజయవాడ వరదలకు జగనే కారణంటూ రామానాయుడు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఏపీని పూర్తిగా నాశనం చేసింది. 2020లో వైసీపీ సర్కారు 198 పనులను పూర్తిగా రద్దు చేసింది. రద్దు చేసిన వాటిలో బుడమేరుకు సంబంధించిన 5 పనులు కూడా ఉన్నాయి. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులను చంద్రబాబు 80 శాతం కంప్లీట్ చేశారు. బుడమేరు బెజవాడకు దు:ఖదాయిని అని తెలిసి చంద్రబాబు ఆ పనులను ప్రారంభించారు. మిగిలిన పనులను జగన్ పూర్తి చేసి ఉంటే గండ్లు పడేవి కావు. బుడమేరు వరద విజయవాడను ముంచెత్తేదికాదు.


Also Read: సొంతగూటికి శిద్దా రీ ఎంట్రీ? చంద్రబాబు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారా?

కేవలం బుడమేరుకు గండ్లు పడటం వల్లే విజయవాడలో వరదలు వచ్చాయి. 5 సంవత్సరాల జగన్ పాలనా పాపం కారణంగానే విజయవాడకు వరదలు వచ్చాయి. జగన్ చేసిన పాపం ప్రజలకు శాపంగా మారింది. అభివృద్ధి పనులను రద్దు చేసిన జగన్ కు అసలు బుడమేరు గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయాడు. 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రకాశం బ్యారేజీ నీరందిస్తున్నది. అటువంటి బ్యారేజీపై కూడా గత సీఎం జగన్ కుట్ర పన్నారు. బోట్లు కొట్టుకుపోతాయని తెలిసి కూడా యజమాని లంగరు వేయలేదు. మీరన్నట్టే అది కుట్ర కాకపోతే బోట్లకు లంగరు ఎందుకు వేయలేదు? నా ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి. ఆ మూడు బోట్ల బరువు 120 టన్నులు. అంత బరువున్న ఆ మూడు బోట్లు ఢీకొని 17 టన్నుల బరువు ఉన్న కౌంటర్ వెయిట్ రెండు ముక్కలయ్యింది. అదే పడవలు బ్యారేజీ పిల్లర్ ను ఢీకొని ఉంటే గుంటూరు, కృష్ణా జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉండేది? కనీసం మాటలకు వర్ణించలేనంతగా పరిస్థితి ఉండేది’ అంటూ రామానాయుడు అన్నారు.


Also Read: బాబు వర్సెస్ జగన్ రాజకీయం.. మళ్లీ రాజుకుందా?

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×