BigTV English

Samantha: సామ్ ఏడుపు వెనుక ఇదా అసలు కథ.. ఖంగుతిన్న ఫ్యాన్స్..!

Samantha: సామ్ ఏడుపు వెనుక ఇదా అసలు కథ.. ఖంగుతిన్న ఫ్యాన్స్..!

Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సమంత (Samantha )ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టింది.ముఖ్యంగా ప్రతి హీరోతో కూడా మంచి స్నేహబంధం ఏర్పరుచుకుంది సమంత. అందుకే సమంతకు కష్టం వస్తే అండగా ఇండస్ట్రీ నిలబడుతుందని.. మొన్న నాగార్జున (Nagarjuna)ఎన్ – కన్వెన్షన్ హాల్ కూల్చివేసినప్పుడు జరిగిన సన్నివేశంతో అందరికీ స్పష్టమైందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా సమంత నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకొని, అటు మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూ ఇండస్ట్రీకి ఏడాది పాటు దూరమైంది. అయితే ఆ సమస్యతో బాధపడుతున్నప్పటికీ తాను పూర్తి చేసిన ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమాలకు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కన్నీరు పెట్టుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఈమె ఏడవడం కొత్తేమీ కాదు.. తరచూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అంటూ పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఏడుపుకు కారణాలు బయటపెట్టింది.


కన్నీళ్ళకు అసలు కారణం అదే..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతతో యాంకర్ మాట్లాడుతూ.. మీరు ప్రతి చిన్నదానికి ఏడుస్తారా..? అని ప్రశ్నించగా సమంత మాట్లాడుతూ.. మీరు ఈ ప్రశ్న అడిగి మంచి పని చేశారు. నేను అస్తమాను ఏడుస్తానని అందరూ అనుకుంటున్నారు. అయితే నా ఏడుపుకి గల కారణం నాకు కళ్ళల్లో లైట్ పడితే కన్నీళ్లు వస్తాయి. నాకు లైట్ సెన్సిటివిటీ ఉంది. ఎక్కువ కాంతి నా కళ్ళల్లో పడడం వల్లే నాకు కన్నీళ్లు వస్తాయి.కానీ అది చూసిన ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి దానికి ఏడుస్తానని, నేను చాలా సెన్సిటివ్ అని అనుకుంటారు. కానీ నేను ఏ రోజు కూడా నా వ్యక్తిగత కారణాలవల్ల ఏడవను” అంటూ అసలు విషయాన్ని తెలిపింది సమంత. ఇది విన్న ఆమె అభిమానులు సమంత మళ్లీ ఇలాంటి ఒక కొత్త సమస్యతో బాధపడుతోందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఎన్నో కష్టాలు.. మరెన్నో కన్నీళ్లు..

ఇక సమంత వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఆమె తన వైవాహిక బంధం ముగిసిన తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వ్యక్తిగత ఒత్తిడిలు, ఆరోగ్య సంబంధిత సమస్యలు ఇలా ఎన్నో.. ఆమె ఇప్పటికీ ఎదుర్కొంటుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఆ సమస్యల గురించి సమంత కన్నీరు పెట్టిన సందర్భాలు ఎన్నో.ఈ కష్టాలను ప్రజల ముందు నేరుగా చూపించకుండా.. తన మనసులోనే ఉంచుకొని.. ఇటీవల అభిమానులతో పంచుకుంది. అంతేకాదు అలా చెప్పే సందర్భంలో భావోద్వేగానికి గురైంది. తన కెరియర్ లో ఎన్నో కష్టాలు,కన్నీళ్లు. ఇప్పటికీ ఆ తాలూకా బాధలతో సతమతమవుతుందని సమాచారం. కనీసం ఇప్పటికైనా ధైర్యంగా ఉండాలని, వచ్చిన ప్రతి సమస్యకు కూడా కన్నీరు సమాధానం కాదని సమంత తనను తాను స్ట్రాంగ్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలదని అభిమానులు సలహా ఇస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సమంత ఒకవైపు మయోసైటిస్, మరొకవైపు లైట్ సెన్సిటివిటీ ఇంకొక వైపు కెరియర్ ..అంతే కాదండోయ్ ఇంకా ఎన్నో వ్యక్తిగత సమస్యలను కూడా ఆమె ఎదుర్కొంటుందని వాటి నుంచి త్వరగా బయటపడి మళ్లీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×