E-Paper
Advertisement

Jabaradasth Emmanuel: ఆయన చివరి చూపు కూడా దక్కలేదు.. స్టేజి మీదనే వెక్కి వెక్కి ఏడ్చా..

Jabaradasth Emmanuel: ఆయన చివరి చూపు కూడా దక్కలేదు.. స్టేజి మీదనే వెక్కి వెక్కి ఏడ్చా..
Advertisement

Jabaradasth Emmanuel: సెలబ్రిటీల జీవితాలు పైకి కనిపించేంత అందంగా ఉండవు. ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొంటే తప్ప ఆ సెలబ్రిటీ హోదా దక్కదు. ఎన్నోసార్లు కుటుంబాలను కూడా పక్కన పెట్టి సెట్స్ లోనే షూటింగ్ కోసం ఉండిపోతారు. తాజాగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తన తాత చనిపోయినా కూడా వెళ్లలేని పరిస్థితి అని, ఆయనను చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను అని ఎమోషనల్ అయ్యాడు.

జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన నటుల్లో ఇమ్మాన్యుయేల్ ఒకడు. కలర్ తక్కువ, బట్ట ఉండడంతో తన మీద తానే పంచ్ లు వేసుకొని ఫేమస్ అయ్యాడు. ఇక వర్ష లవ్ ట్రాక్ అతడిని ఎక్కడికో తీసుకెళ్లింది. ఇప్పుడు షోస్ మాత్రమే కాకుండా సినిమాలు కూడా చేస్తున్నాడు. తాజాగా ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం గంగం గణేశా. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్మాన్యుయేల్ హీరో ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. మే 31 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూచేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూకు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇమ్మాన్యుయేల్ తన జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ను తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు. ” జబర్దస్త్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులు. స్కిట్ చేస్తున్న సమయంలో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మా తాత చనిపోయాడు. ఇంటికి రమ్మని.. స్కిట్ మధ్యలో వదిలేసి వెళ్ళలేను.

నాకు మా తాత అంటే చాలా ఇష్టం. ఏం చేయలేని పరిస్థితి. స్టేజి వెనక్కి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చి కళ్ల నీళ్లు తుడుచుకొని స్కిట్ చేశాను. ఆ కెరీర్ బెస్ట్ స్కిట్స్ లో అది ఒకటి. ఇక స్కిట్ అయ్యాక ఇంటికి బయల్దేరాను. నేను వెళ్ళేసరికే తాత అంత్యక్రియలు అయిపోయాయి. ఆయన చివరి చూపు కూడా దక్కలేదు” అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×