Jabardast Dhanraj:జబర్దస్త్ (Jabardast) ప్రోగ్రాం ద్వారా ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఆర్టిస్ట్ ల్లో ధనాధన్ ధనరాజ్ (Dhanraj) ఒకరు. ఈయన జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా పాపులర్ అయ్యి, ఆ తర్వాత దాదాపు 90 సినిమాల్లో కమెడియన్ గా చేశారు. అలా పలు బుల్లితెర మీద పలు ఈవెంట్స్ చేస్తూ వెండితెర మీద కూడా చాలా సినిమాల్లో కమెడియన్ గా రాణించారు.అలా మొదటిసారి ‘ధనలక్ష్మి తలుపు తడితే’ సినిమాకి నిర్మాతగా మారి డబ్బులు పోగొట్టుకున్నారు. అయితే ఫస్ట్ టైం ధనరాజ్ డైరెక్షన్ రంగంలోకి కూడా దిగారు. ధనరాజ్ డైరెక్టర్ గా తెరకెక్కిన తాజా మూవీ రామం రాఘవం. ఈ సినిమాలో సముద్రఖని (Samuthirakani), ధనరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సముద్రఖని కొడుకు పాత్రలో ధనరాజ్ నటించగా తండ్రీకొడుకుల బాండింగ్ తో ఈ సినిమా తెరగకెక్కిందట. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలకు సిద్ధమవ్వడంతో సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనరాజ్ కి గతంలో స్టేజ్ మీద మంచు మనోజ్ తో జరిగిన గొడవ గురించి ప్రశ్న ఎదురైంది. మరి ఇంతకీ ధనరాజ్.. మనోజ్ (Manoj) మధ్య జరిగిన గొడవ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
మంచు మనోజ్ తో గొడవపై ధనరాజ్ క్లారిటీ..
తండ్రీ కొడుకుల ఎమోషన్స్ తో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయలేని కథతో రామం రాఘవం (Ramam Ragham) సినిమా తెరకెక్కింది అని ధనరాజ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. డైరెక్టర్గా అలాగే నటుడిగా ఈ సినిమాలో చేస్తున్నట్టు తెలియజేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ధనరాజ్ కి మనోజ్ తో గొడవ గురించి ప్రశ్న ఎదురవ్వగా దానిపై క్లారిటీ ఇచ్చారు. ధనరాజ్ మాట్లాడుతూ..”మంచు మనోజ్ తో నేను గొడవ పెట్టుకోలేదు. అది ఫ్రాంక్ మాత్రమే. అల్లరి నరేష్ నటించిన జంప్ జిలాని మూవీ ఈవెంట్లో నేను యాంకర్ గా చేశాను. అయితే ఆ టైంలో మనోజ్ స్టేజ్ మీదకి వస్తున్నాడు ఒక చిన్న ఇష్యూలాంటిది చేస్తాడు అని నాకు ముందుగానే భూపాల్ అన్న చెప్పారు. దాంతో నేను ఓకే అని స్టేజ్ మీదకు వచ్చిన మనోజ్ తో గొడవ పెట్టుకున్నట్టే యాక్టింగ్ చేశా.అయితే అదంతా ఫ్రాంక్ అయినప్పటికీ.. క్షణాల్లో వైరల్ అవ్వడంతో చాలామంది మా ఇద్దరి మధ్య నిజంగానే గొడవ జరిగిందనుకున్నారు.
మనోజ్ క్యారెక్టర్ అదే – ధనరాజ్..
అయితే ఈ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ‘కరెంట్ తీగ’ షూటింగ్లో ఉన్న సమయంలో ఈ విషయం మనోజ్ అన్న నాతో అన్నారు.ఇదేంట్రా మనం ఏదో సరదాగా చేస్తే ఇంత వైరల్ చేశారు. ఇప్పుడు మన మధ్య గొడవలు లేవని ఒక ఫోటో దిగి పోస్ట్ చేద్దాం అని చెప్పారు. దాంతో మనోజ్ అన్న చేతులు కట్టుకొని కూర్చుంటే ఆయన మీద నేను చేతులు వేసి ఒక ఫోటో షేర్ చేసాం. అయితే ముందుగా ఇద్దరం గొడవ పెట్టుకున్నట్టు ఒక టాక్ జనాల్లోకి వెళ్లడంతో అదే నిజం అనుకున్నారు. జస్ట్ సరదా కోసమే మేము అలా గొడవ పెట్టుకున్నట్టు యాక్టింగ్ చేసాం. నిజంగా మా ఇద్దరి మధ్య గొడవలు లేవు. మనోజ్ అన్న బంగారం” అంటూ ధనరాజ్ తాజా ఇంటర్వ్యూలో మనోజ్ తో గొడవలపై క్లారిటీ ఇచ్చారు.