Kota Srinivas Rao..విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన దిగ్గజ సీనియర్ నటులలో కోట శ్రీనివాసరావు (Kota Srinivas Rao)కూడా ఒకరు. 1942 జూలై 10న జన్మించిన ఈయన తన సినీ కెరియర్లో ఇప్పటివరకు 750కి పైగా చిత్రాలలో నటించారు. అవకాశం ఇస్తే ఇప్పటికీ నటించడానికి సిద్ధం అంటున్నారు. కానీ వయసు మీద పడడంతో ఆ తరహా పాత్రలు ఆయనకు వరించడం లేదని చెప్పవచ్చు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా, కమెడియన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. గత కొంత కాలం క్రితం యంగ్ హీరోలకు తాతగా నటించి అలరించారు. ప్రస్తుతం వయసు మీద పడడంతో పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. సినిమా కెరియర్ జోరుగా కొనసాగిస్తున్న సమయంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కృష్ణ(Krishna )వల్లే టీడీపీ నాయకులు తనపై దాడి చేశారని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సీనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమా..
1978లో వచ్చిన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కోట శ్రీనివాసరావు. తన అద్భుతమైన నటనతో.. విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్నారు. ఇకపోతే ఒకవైపు సినిమాలలో జోరుగా కొనసాగుతున్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణతో మంచి అనుబంధం ఏర్పడింది . ఆ క్రమంలోనే కృష్ణ నటించే ప్రతి సినిమాలో కూడా కోట శ్రీనివాసరావుకి అవకాశం కల్పించేవారు. ఇకపోతే సినిమా పరంగా ఎంత సన్నిహితంగా ఉన్నా.. రాజకీయంగా నటీనటుల మధ్య విభేదాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కృష్ణ తరం హీరోలలో సీనియర్ ఎన్టీఆర్(Sr.NTR) టీడీపీ పార్టీని ఏర్పాటు చేసి పార్టీని అధిష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో.. కృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో కీలకంగా వ్యవహరించేవారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని ఎన్టీఆర్ కంకణం కట్టుకున్న సమయంలో కృష్ణ.. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా సినిమాలు చిత్రీకరించడం మొదలుపెట్టారు. కానీ అవేది సఫలం కాలేకపోయాయి ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహార శైలి మీద, ప్రభుత్వం మీద వ్యంగ్యంగా విమర్శించే కథాంశంతో మండలాధీశుడు సినిమా తీయడం జరిగింది.
కృష్ణ ప్రోద్భలంతోనే ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమా..
ఎన్టీఆర్ పార్టీని పెట్టి అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి అవ్వడంతో.. కోటా శ్రీనివాసరావుని ఎన్టీఆర్ క్యారెక్టర్ ను పోషించమని చెప్పి.. ఎన్టీఆర్ కి ప్రజలలో వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనుకున్నారట. అందుకే కోటా శ్రీనివాసరావును ప్రోత్సహించారు. ఆ సమయంలో అన్ని ఆలోచించిన కోటా శ్రీనివాసరావు.. తనను కొడతారేమో, సినిమాల్లో అవకాశాలు రావేమో అని భయపడకుండా తనకు కృష్ణ ఇచ్చిన ప్రోద్బలంతో మండలాధీశుడు సినిమాలో ఎన్టీఆర్ గెటప్ వేశారు కోటా శ్రీనివాసరావు. ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జమున (Jamuna), గుమ్మడి వెంకటేశ్వరరావు (Gummadi Venkateswar Rao), భానుమతి (Bhanumathi) తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1987లో విడుదలైన ఈ సినిమాను వర్మ పిక్చర్స్ పతాకం పై డాక్టర్ డివిఎన్ రాజు నిర్మించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత కోటా శ్రీనివాసరావు పై టిడిపి శ్రేణులలో పూర్తిస్థాయిలో వ్యతిరేకత నెలకొంది.
కోట శ్రీనివాసరావు పై టీడీపీ నాయకులు దాడి..
అలా నాడు జరిగిన సంఘటనలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘కృష్ణ మండలాధీశుడు సినిమా చేయాలని పట్టుబట్టడం వల్లే నేను చేశాను. అయితే ఒకసారి బెజవాడకు నా కూతుర్ని చూడడానికి వెళ్లాను. ఆ సమయంలో సీఎం గా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ ఏదో ఫంక్షన్ వచ్చారు. ఇక దాంతో ఎక్కడ చూసినా టిడిపి పార్టీ జెండాలే కనిపించాయి. ఇక అప్పుడే నాకు భయం కలిగింది. కానీ ఏం చేయలేక కృష్ణ ఎక్స్ప్రెస్ దిగి ఒక మూలన నడుచుకుంటూ వెళ్తున్నాను.. అయితే ఎన్టీఆర్ కూడా తిరిగి అదే కృష్ణ ఎక్స్ప్రెస్ కి వెళ్లాల్సి ఉంది. ఇక దాంతో రైల్వే స్టేషన్ మొత్తం టిడిపి కార్యకర్తలతో, అభిమానులతో నిండిపోయింది. అక్కడ నన్ను చూసిన ఆయన అభిమానులు అదిగో కోట అంటూ.. నా మీద పడి దాడి చేశ…