BigTV English

ShanthiSwaroop : నవ్వులు పంచే శాంతి స్వరూప్ జీవితంలో అన్నీ కష్టాలే .. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

ShanthiSwaroop : నవ్వులు పంచే శాంతి స్వరూప్ జీవితంలో అన్నీ కష్టాలే .. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

ShanthiSwaroop : జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొందరు స్టార్ హీరోలతో సినిమాలను చేస్తే మరికొందరు హీరోలుగా, హాస్య నటులుగా రానిస్తున్నారు. ఈ షోలో ఒకప్పుడు లేడి కమెడీయన్లు కనిపించేవారు కాదు. మగవాళ్లే గెటప్ లు వేసుకొని ఆడవాళ్లు లాగే స్కిట్స్ చేసేవారు. అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు శాంతి స్వరూప్.. లేడి గెటప్ వేసి తన పంచులతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. మిగతా వాళ్ళు తర్వాత వేరే దారులు చూసుకున్నా శాంతి స్వరూప్ మాత్రం చాలా కాలం నుంచి జబర్దస్త్ లోనే లేడీ గెటప్స్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో బాగానే సంపాదించాడు. అంతేకాదు శాంతి స్వరూప్ ఓ కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.. అయితే తన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా కూడా అందరికి నవ్వును పంచాడు. ఆయన జీవితంలో పడ్డ కష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం..


ఇటీవల బుల్లితెర పై యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న ఓ షోకి శాంతి స్వరూప్ వచ్చాడు. శాంతి స్వరూప్ జబర్దస్త్ కి రాకముందు ఎలాంటి బాధలు పడ్డారో వెల్లడించారు. తమ ఫ్యామిలీ ఎలాంటి ధీన స్థితి లో ఉండేదో చెప్పుకొచ్చాడు. తన తల్లి సరోజనమ్మ తాము చిన్నప్పుడు అమ్మ ఇంటింటికి తిరిగి పాచిపనులు చేసేదని పేర్కొన్నారు. అంట్లు తోమి తమని పోషించందన్నాడు. అమ్మ కడుపు మాడ్చుకొని మాకు దొరికినది పెట్టేది. అప్పటిలో మాకు ఆకలి బాధలు ఎలా ఉండేవంటే అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మకి గొంతు సరిగా లేదని, ఆమె సరిగా మాట్లాడలేదని తెలిపాడు. ఏదో మాట్లాడాలనుకుంటుంది. కానీ మాట్లాడలేదు అంటూ తన తల్లి గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ షోకు తన తల్లి కూడా వచ్చి కొడుకు గురించి గొప్పగా చెప్పింది. వీరిద్దరి ప్రేమను చూసి అక్కడున్న వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు..

ఆ షో వీడియో వైరల్ అవ్వడంతో చూసిన నెటిజన్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. జీవితంలో కష్టాలు పడిన వారే జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారని కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షోలో లేడీ గెటప్‏లో కనిపించి తన కామెడీతో అందరినీ నవ్వించారు. అటు జబర్దస్త్ షో చేస్తూనే.. ఇటు సోషల్ మీడియాలో సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. అందులో తన లైఫ్ స్టోరీతోపాటు.. కాస్ట్యూమ్స్ డిజైన్స్, కామెడీకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటుంటారు.. సినిమాలు ఆఫర్స్ వచ్చిన కాదానకుండా ఒకే చెప్పేస్తున్నాడు.. అలా ఒకవైపు సినిమాలు, మరోవైపు జబర్దస్త్, అలాగే పండగలకు చేసే ఈవెంట్స్ లలో సందడి చేస్తూ అందరిని నవ్విస్తుంటాడు.. ఆయన ఈవెంట్స్ తోనే బాగా సంపాదిస్తూ అందరి మనసును దోచుకున్నాడు.. శాంతి గతంలో ఆపరేషన్ చేయించుకున్నాడని వార్తలు కూడా వినిపించాయి. కానీ అందులో నిజం లేదని చెప్పాడు. ప్రస్తుతం వరుసగా షో లు చేస్తున్నాడు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×