Bhu Bharathi Act 2024: తెలంగాణలో భూ భారతి చట్టం నిర్వహణ బాధ్యతలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ చేతికి వచ్చాయి. ఎన్నికల్లో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి తీసుకొని వచ్చారు. ఈ పోర్టల్ నిర్వహణ విదేశీ కంపెనీల చేతి నుంచి నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్‌కి ఇచ్చారు. ఇప్పుడు ఈ బిల్లు గవర్నర్ దగ్గరకు చేరింది.
డిసెంబరు 18న శాసనసభలో ఈ బిల్లును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అదే నెల 20న శాసనసభలో, 21న శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందింది. అటు రెవెన్యూ శాఖ కూడా భూ భారతికి సంబంధించి మార్గదర్శకాలను పూర్తి చేసింది. సభలు ఆమోదించిన బిల్లుల ప్రతులను ప్రభుత్వం సోమవారం రాజ్‌భవన్‌కు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఉత్తర్వులు జారీ అవుతాయి. ఆ తర్వాత చట్టం అమలులోకి వస్తుంది. ఇకపై సాగు భూముల రిజిస్ట్రేషన్లు-మ్యుటేషన్ల సేవల పోర్టల్ నిర్వహణ పూర్తిగా ఎన్‌ఐసీ చూసుకుంటుంది. కొత్త ఏడాది మొదటిరోజు నుంచే పోర్టల్‌ను పూర్తిస్థాయిలో ఎన్‌ఐసీ నిర్వహించనుందని రెవెన్యూ వర్గాలు తెలిపారు.
గత ప్రభుత్వం 2020 నవంబరు 2 ధరణి పోర్టల్‌ను IFLS, దాని అనుబంధ సంస్థ టెర్రా IACS నిర్వహిస్తూ వచ్చాయి. అయితే విదేశీ సంస్థ చేతుల్లోని నుంచి పోర్టల్‌ను తప్పించి స్వదేశీ నిర్వహణలోకి తీసుకొస్తామని ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది నవంబరు నెలాఖరుతో టెర్రా ఐసీఎస్‌తో ఒప్పందాన్ని ముగించింది. దీంతో ఎన్‌ఐసీకి అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. భూ-భారతిగా లోగో, ఇతర వివరాలను రెవెన్యూ శాఖ రూపొందిస్తోంది.
Also Read: కేసీఆర్ డేరింగ్ స్టెప్.. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీ నేత? వారసుల మాటేంటి?
ఇదిలా ఉంటే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జనవరి 4న క్యాబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు భేటీ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ మంత్రులు హాజరుకానుండగా.. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు సహాయం గురించి చర్చించనున్నట్టు సమాచారం. అలానే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన కూడా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.