Jagadekaveerudu Athilokasundari Collections : ఈమధ్య టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు నటించిన కొన్ని సినిమాలు మళ్లీ రీ రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాయి. కొన్ని సినిమాలు గతంలో కన్నా ఎక్కువగా వసూళ్లను రాబట్టి హిట్ టాక్ ను అందుకున్నాయి.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ రీరిలీజ్ అయ్యింది. 35 ఏళ్ల క్రితం చిరంజీవి- శ్రీదేవి జంటగా నటించిన సూపర్ హిట్ ఫాంటసీ డ్రామా మూవీ మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీ 3డీలో రిలీజ్ చేశారు. మరి మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం..
రీ రిలీజ్ కు ఖర్చు ఎంతంటే..?
ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే రిలీజ్ అయిన ప్రతి మూవీ మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ మే 9 న రిలీజ్ అయ్యింది. 3డీ వర్షన్ లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ లోని డస్ట్ ని కూడా క్లియర్ చేసి స్కానింగ్ లో రన్ చేసాం. ప్రేక్షకులకి ఒక అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ ఇవ్వడం కోసం 8 k సౌండ్ కి సెట్ చేసినట్లు మేకర్స్ అన్న విషయం తెలిసిందే. దీని కోసం మళ్లీ ఈ సినిమా కోసం దాదాపు 8 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది. అన్ని అప్డేట్ చేసి మరీ రిలీజ్ చేశారు.. అయితే ఈ మూవీకి థియేటర్లలోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి కలెక్షన్స్ ఏ మాత్రం వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం..
Also Read : వార్ ఎఫెక్ట్… వాయిదా పడబోతున్న బడా సినిమాలు ఇవే..
ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
1990 మే 9 న ప్రేక్షకుల ముందుకు రాగా భారీ విజయాన్ని అందుకుంది. తుఫాన్ ని సైతం తట్టుకొని భారీ కలెక్షన్స్ ని రాబట్టి చిరంజీవి, శ్రీదేవి, రాఘవేంద్రరావు, అశ్వనీదత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 2025 మే 9 కి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రీ రిలీజ్ అయ్యింది.. ఈ మూవీకి ఎనిమిది కోట్లు ఖర్చు చేశారు. మొదటి రోజు మంచి రెస్పాన్స్ రావడంతో పాటుగా కలెక్షన్స్ కు అదే విధంగా వసూల్ చేసింది. దాదాపు 1.75 కోట్ల వరకు వసూల్ చేసిందని సమాచారం.. మరి మొదటి రోజు ఏ మాత్రం కలెక్షన్స్ రాబడిందో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.. ఇదేవిధంగా వీకెండ్ లో కూడా కలెక్షన్స్ రాబడితే సక్సెస్ అవుతుందని మెగా ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు..
ఇక ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు.. ఆ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది..
#JVAS #Chiranjeevi : DAY 1 WORLD WIDE
OPENING GROSS – 1.75CR+#JagadekaVeeruduAthilokaSundari #JVAS #Chiranjeevi #Tollywood #BIGTVCinema @KChiruTweets pic.twitter.com/MbfZRbgxxJ— BIG TV Cinema (@BigtvCinema) May 10, 2025