BigTV English

Sreemukhi Remuneration : సుమక్కను మించిన డిమాండ్ రాములక్కది… ఒక్కో షోకి ఎన్ని లక్షలంటే..?

Sreemukhi Remuneration : సుమక్కను మించిన డిమాండ్ రాములక్కది… ఒక్కో షోకి ఎన్ని లక్షలంటే..?

Sreemukhi Remuneration..శ్రీముఖి (Sreemukhi).. బుల్లితెర రాములమ్మగా తెలుగు రాష్ట్రాలలో భారీ పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి.. ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా అటు టీవీలో, ఇటు సినిమాల్లో తెగ సందడి చేస్తున్న ఈమె.. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వరుస అవకాశాలతో మరింత బిజీగా మారింది. ఇదిలా ఉండగా శ్రీముఖి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆమె గురించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే శ్రీముఖి ఒక్కో షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటోంది..? స్పెషల్ ఈవెంట్స్ కైతే ఆమె పారితోషకం ఎంత? అనే విషయాలు వైరల్ గా మారాయి.


సినిమాలే కాదు షోలతో మరింత పాపులారిటీ..

‘జులాయి’ సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీముఖి, ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్మెన్’ వంటి చిత్రాలలో డీసెంట్ పాత్రలు పోషించి, ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఈమెకు హీరోయిన్గా సరైన బ్రేక్ రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి, బుల్లితెరపై సందడి చేసింది. అలా ‘అదుర్స్’ అనే షో తో ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టిన ఈమె.. అప్పటినుంచి వరుస షో ల మీద షోలు చేస్తోంది. అలా ఇప్పటివరకు ఈమె కెరియర్ లో అదుర్స్ 2, మనీ మనీ, సూపర్ మామ్, సూపర్ సింగర్, జో లకటక , కామెడీ నైట్స్ , బొమ్మ అదిరింది, పటాస్ వంటి షోలకు హోస్ట్గా చేసింది. ఇక ఇప్పుడు సరిగమప వంటి సింగింగ్ కాంపిటీషన్ కి కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలు, షోలు మాత్రమే కాకుండా “సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్” ( సైమా) కార్యక్రమానికి కూడా హోస్ట్ గా వ్యవహరించింది. ఇక ఈ కార్యక్రమానికి ఏకంగా రూ.20 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.


ALSO READ; Rashmika on VD Birthday : లేట్ గా అయినా లేటెస్ట్ గా విష్ చేసిన రష్మిక.. ముద్దు పేరుతో పిలుస్తూ..!

ఒక్కో షో కి శ్రీముఖి రెమ్యూనరేషన్ ఎంతంటే..?

ఇకపోతే ప్రస్తుతం బుల్లితెరపై వరుస షోలు చేస్తూ బిజీగా మారిన ఈమె.. ప్రస్తుతం ఒక్కో షో కి హోస్ట్ గా వ్యవహరిస్తే.. రెగ్యులర్ షోలకు ₹1 లక్ష నుండి ₹1.25 లక్షలు. స్పెషల్ ఈవెంట్స్‌కు అయితే ₹1.5 లక్షల నుండి ₹2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ 3 లో కూడా పాల్గొని సందడి చేసింది. బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నర్ అప్ గా నిలిచింది. దీనికి సీజన్ మొత్తం కలపి దాదాపు రూ. 1 కోటి వరకు వచ్చినట్టు సమాచారం. ఇలా ఒక వైపు షోలు మరొకవైపు సినిమాలు చేస్తూ భారీగానే సంపాదిస్తోంది శ్రీముఖి. ఇక దీన్ని బట్టి చూస్తే ఒకప్పుడు సుమా (Suma) మాత్రమే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునేది. కానీ సుమక్కని కూడా డామినేట్ చేసి శ్రీముఖి బాగా సంపాదిస్తోందని చెప్పవచ్చు. అంతేకాదు సుమాను కూడా మించి వరుస అవకాశాలు అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ బుల్లితెర రాములమ్మ అలియాస్ శ్రీముఖి. ఇక ఇదే కొనసాగితే సుమక్కను మించిన స్టార్ స్టేటస్ ను రాములమ్మ సంపాదించుకుంటుందనటంలో సందేహం లేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×