BigTV English
Advertisement

The Conjuring: Last Rites Teaser : స్టార్ట్ చేశాక వెనక్కి వెళ్లలేము… హర్రర్ సీన్స్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ టీజర్

The Conjuring: Last Rites Teaser : స్టార్ట్ చేశాక వెనక్కి వెళ్లలేము… హర్రర్ సీన్స్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ టీజర్

The Conjuring: Last Rites Teaser : అదిరిపోయే హాలీవుడ్ హర్రర్ మూవీ అనగానే గుర్తొచ్చే సినిమాలలో ‘ది కంజూరింగ్’ (The Conjuring) ముందు వరుసలో ఉంటుంది. ఈ ఫ్రాంచైజీకి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. ఇందులో చివరి పార్ట్ గా ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ ఇదే ఏడాది థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ మూవీ టీజర్ ను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ టీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.


టీజర్ లో హైలెట్స్
‘కంజూరింగ్’ యూనివర్స్‌లో తొమ్మిదవ, మెయిన్ సిరీస్‌లో నాల్గవ సినిమాగా వస్తోంది ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’. పైగా ఈ ఫ్రాంచైజీలో ఇదే చివరి చిత్రం కావడంతో మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మైఖేల్ చావెస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వెరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్ మెయిన్ లీడ్స్ గా నటించారు. 2025 సెప్టెంబర్ 5న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ తో ప్రమోషన్లను మొదలు పెట్టారు.

2 నిమిషాల 24 సెకన్ల నిడివి ఉన్న ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ టీజర్ ఎప్పటిలాగే హార్రర్ సీన్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లో ఎడ్, లొరైన్ వారెన్ (పాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా)లు సాల్వ్ చేసిన హర్రర్ కేసులలో, అత్యంత ప్రమాదకరమైన 1986 స్మర్ల్ ఫ్యామిలీ హాంటింగ్‌ కేసు ఆధారంగా సినిమా తెరకెక్కినట్టు వెల్లడించారు. పైగా ఇదే వారి చివరి కేసు అని వెల్లడించారు.


టీజర్ వారెన్‌ల రిటైర్మెంట్ జీవితంతో స్టార్ట్ అవుతుంది. ఎడ్ గుండెపోటు తర్వాత హంటింగ్ కేసులకు దూరంగా ఉండే ఈ జంట… స్మర్ల్ ఫ్యామిలీ హాంటింగ్ వల్ల మళ్లీ రంగంలోకి దిగాల్సి వచ్చినట్టు టీజర్లో కన్పిస్తోంది. 1974-1989 మధ్య ఒక దెయ్యం పెన్సిల్వేనియా కుటుంబాన్ని హింసించడం, “ఈ కేసు ఎందుకు వారికి చివరిది అయింది?” అనే ప్రశ్న టీజర్‌లో కీలకంగా మారింది. లొరైన్‌ తో ఒక దెయ్యం “మేము నీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాము” అని చెప్పడం, ఎడ్ ఒక అంత్యక్రియల సన్నివేశంలో కనిపించడంతో ఒక ప్రధాన పాత్ర ఈ సినిమాలో చనిపోయే ఛాన్స్ ఉందని అన్పించేలా చేసింది. ముఖ్యంగా వారెన్‌ కూతురు జూడీ (మియా టామ్లిన్సన్), ఆమె బాయ్‌ఫ్రెండ్ టోనీ స్పెరా (బెన్ హార్డీ) సినిమాలో చేరడం కథకు కొత్త డైనమిక్‌ను యాడ్ చేసింది. టీజర్‌లో క్రీపీ డాల్స్, అకస్మాత్తుగా కనిపించే దెయ్యాలు, లొరైన్‌పై దాడి చేసే ఒక డీమన్, ఓ డీమన్ లొరైన్‌పై దూకడం వంటి సీన్స్ ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించడం ఖాయం.

నాస్టాల్జియా అండ్ ఫ్రాంచైజీ కనెక్షన్
‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ టీజర్ లో గత చిత్రాలలో ఉన్న ఐకానిక్ హర్రర్ ఎలిమెంట్స్… వలాక్, అనాబెల్, క్రూకెడ్ మ్యాన్ వంటివి ఉండడం అభిమానులకు ఒక ఫినాలే అనుభూతిని కలిగిస్తుంది. వారెన్‌ గదిలోని శాపగ్రస్త వస్తువులు, ఫ్రాంచైజీలోని గత చిత్రాలకు నాస్టాల్జిక్ కనెక్షన్‌ను క్రియేట్ చేశాయి. చీకటి, లైటింగ్, దెయ్యాల భయంకరమైన రూపాలు చూస్తుంటే… ప్రేక్షకులను థియేటర్లలో భయపెట్టడానికి మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు అన్పిస్తోంది. వెరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్ ల కెమిస్ట్రీ టీజర్‌లో బలమైన ఎమోషనల్ కోర్‌ను అందించింది. రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుండడం మరో ఇంట్రెస్టింగ్ విషయం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×