BigTV English

India – Pak War : వార్ ఎఫెక్ట్… వాయిదా పడబోతున్న బడా సినిమాలు ఇవే..

India – Pak War : వార్ ఎఫెక్ట్… వాయిదా పడబోతున్న బడా సినిమాలు ఇవే..

India – Pak War : ఇటీవల పహాల్గామా జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే.. పాకిస్తాన్ ఉగ్రవాదులు టూరిస్ట్ ల పై దాడి చేసి దాదాపు 26 మందికి పైగా హతమార్చారు. ఈ సంఘటనతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడికి అధికారం తీర్చుకునేందుకు భారత్ కూడా పాకిస్తాన్ పై దాడి చేసింది. ప్రస్తుతం ఈ వార్ గురించే వార్తలు వినిపిస్తుంది. భారత్ పాక్ ల మధ్య జరుగుతున్న ఈ వార్ వల్ల దేశవ్యాప్తంగా కీలక పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఈ ప్రభావం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సినిమాలపై కూడా పడింది. వార్ నేపథ్యంలో పలు సినిమాలు తమ రిలీజ్ డేట్‌లను వాయిదా వేసుకుంటున్నాయి.. బాలీవుడ్ లో ఇప్పటికే పలు చిత్రాలు వాయిదా పడ్డాయి.. అదేవిధంగా టాలీవుడ్ లో కూడా బడా హీరోల సినిమాలు వాయిదా పడినట్టు తెలుస్తుంది. అయితే ఏ హీరో సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..


పాక్ – భారత్ యుద్ధం..

ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడి టూరిస్ట్ లను అత్యంత కిరాతకంగా చంపేశారు. వదిలెయ్యమని వేడుకున్నా కూడా కనికరం లేకుండా షూట్ చేసి చంపేశారు. ఈ దారుణ ఘటనతో భారతదేశం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది. కాశ్మీర్ ప్రాంతం మొత్తం రక్తసిక్తం అయిపోయింది. అమాయకుల ప్రాణాలను పొట్టను పెట్టుకున్నారని ప్రజలు పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా సరే పాకిస్తాన్ వాళ్లనే చంపి తీరాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇక భారత్ ఆర్మీ టెర్రరిస్ట్ లకు పూర్తిగా నామరూప లేకుండా చేసేందుకు ఆపరేషన్ సింధూర్ ను మొదలు పెట్టింది. పాకిస్తాన్లోనే ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు వందమందికి మందికి పైగా టెర్రరిస్టులు మరణించారు.. ఇప్పటికీ ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.. అయితే, పాక్, భారత్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం సినీ ఇండస్ట్రీపై ప్రభావాన్ని చూపిందని తెలుస్తుంది.. అయితే ఇప్పటికే పలు బడా హీరోల సినిమాలు వాయిదా పడ్డాయి. అలాగే తెలుగులో కూడా పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయని తెలుస్తుంది. మరి ఇప్పటివరకు ఏ సినిమాలు వాయిదా పడ్డాయో ఒకసారి తెలుసుకుందాం..


Also Read : ‘సింగిల్’ టాక్ పాజిటివ్.. కలెక్షన్స్ పరిస్థితి ఏంటి..?

టాలీవుడ్ బడా సినిమాలు వాయిదా..

పాక్ – భారత్ ల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. మే నెలలో రిలీజ్ కావాల్సిన చాలా చిత్రాలు వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే నెలలో రిలీజ్ కావాల్సిన హరిహర వీరమల్లు, కింగ్డమ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక మల్టీస్టారర్ చిత్రంగా రాబోతున్న భైరవం మే 30న రిలీజ్ అవుతున్నట్లు డేట్ అనౌన్స్ చేశారు.. ఇప్పటివరకు మే నెలలో చాలా సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు బోలెడు ఉన్నాయి. మిగిలిన సినిమాల్లో ఏ సినిమా డేట్ ను పోస్ట్ పోన్ చేసుకుంటుందో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×