BigTV English

Jai Hanuman: ‘జై హనుమాన్’లో చిరంజీవి, మహేశ్ బాబు.. దర్శకుడి ప్లాన్ మామూలుగా లేదు..!

Jai Hanuman: ‘జై హనుమాన్’లో చిరంజీవి, మహేశ్ బాబు.. దర్శకుడి ప్లాన్ మామూలుగా లేదు..!

Jai Hanuman: ఎవరూ ఊహించని కొన్ని చిన్న సినిమాలు.. అద్భుతమైన ఘన విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అందులో ‘హనుమాన్’ మూవీ ముందు వరుసలో ఉంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్ నటుడు తేజా సజ్జ హీరోగా నటించాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని కైవసం చేసుకుంది.


బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది. అయితే ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతూ దూసుకుపోతోంది. ఈ సినిమాతో అటు దర్శకుడు ప్రశాంత్ వర్మకు, ఇటు హీరో తేజా సజ్జకు మంచి పేరు వచ్చింది. ఈ మూవీ ఘన విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల సీక్వెల్‌ను ప్రకటించాడు. ఈ సీక్వెల్ మూవీకి ‘జై హనుమాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశాడు.

ఇందులో శ్రీరాముడు, ఆంజనేయుడి పాత్రలు ప్రధానంగా ఉండనున్నాయి. అయితే ఈ పాత్రలలో స్టార్ హీరోలు నటిస్తారని ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపాడు. దీంతో రాముడు, ఆంజనేయుడి పాత్రలలో ఎవరు నటిస్తారోనన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ పాత్రలకు ఏ హీరో అయితే బాగుంటుందని తాను అనుకున్నారో దర్శకుడు ప్రశాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.


‘‘జై హనుమాన్ మూవీలో హనుమాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటులు రెడీగా ఉన్నారు. అయితే ఆ పాత్ర చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న ఫీలింగ్ వారిలో కలగాలి.. ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండవచ్చు. ఇక అన్నీ కుదిరితే చిరంజీవి ఆ పాత్ర చేసే అవకాశముంది. పద్మ విభూషణ్ తర్వాత ఆయన బిజీ అయిపోయారు. అందువల్ల ఆయనకు వీలు అయినపుడు వెళ్లి కలుస్తాను. అలాగే రాముడిగా నా మనసులో ఉన్న నటుడు మహేశ్ బాబు. ఈ క్యారెక్టర్‌ని మహేశ్ బాబుతో చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఆయన రాముడిగా ఎలా ఉంటారో గ్రాఫిక్స్‌లో చూశాము.’’ అంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. దీని బట్టి చూస్తే జై హనుమాన్ మూవీకి వీరిద్దరినీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×