BigTV English

Rajinikanth: రజనీకాంత్ పాన్ ఇండియా మూవీ ఫిక్స్.. నిర్మాత ఎవరంటే?

Rajinikanth: రజనీకాంత్ పాన్ ఇండియా మూవీ ఫిక్స్.. నిర్మాత ఎవరంటే?
Advertisement

Rajinikanth new movie update


Rajinikanth new movie update(Tollywood movies news): సూపర్ స్టార్ రజనీకాంత్ గతేడాది ‘జైలర్’ మూవీతో తమ అభిమానుల ఆకలి తీర్చాడు. అప్పటి వరకు ఒక్క హిట్టు కూడా రజనీకాంత్‌కు లేకపోవడంతో ఆయనతో పాటు రజనీ అభిమానులు కూడా నిరుత్సాహంలో ఉన్నారు. కానీ జైలర్ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో వారిలో సరికొత్త ఉత్సాహం వచ్చింది.

ఇక అదే జోష్‌లో రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో లాల్ సలాం మూవీ చేశారు. అయితే ఇందులో ఆయన ప్రధాన పాత్రలో కాకుండా గెస్ట్ రోల్‌లో నటించారు. కానీ ఈ సినిమాలో ఆయన రోల్ మాత్రం చాలా పవర్ ఫుల్‌గా చూపించారు. అయినప్పటికీ ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.


అంతేకాకుండా రజనీకాంత్ ఇమేజ్‌కు కూడా కాస్త దెబ్బతీసింది. ఈ మూవీపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ మూవీలో రజనీకాంత్ కేవలం 40 నిమిషాలు మాత్రమే కనిపించాడు. ఈ 40 నిమిషాలకు రజనీకాంత్ దాదాపు రూ.40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

READ MORE: పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ మూవీ అరుదైన రికార్డ్.. ఏ హీరోకి ఇది సాధ్యం కాదు..!

ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత రజనీకాంత్ ఎలాంటి స్టోరీతో రాబోతున్నాడు అనే ఆసక్తి అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఉంది. అలా ఎదురుచూసే వాళ్లకి తాజాగా ఓ గుడ్‌న్యూస్ అందింది. రజనీకాంత్ తన తదుపరి సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో చేస్తున్నట్లు తెలుస్తోంది.

రజనీకాంత్ – ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా కలిసి ఓ భారీ మూవీకోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత సాజిద్ తెలిపారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఒక ఫీచర్ ఫిల్మ్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సాజిద్ తెలిపారు.

ఈ మేరకు ‘‘లెజండరీ రజనీకాంత్ సార్‌తో కలిసి పనిచేయడం నిజమైన గౌరవం!. మేము కలిసి ఈ మరపురాని ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాము’’ అంటూ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వివారాలను మాత్రం గోప్యంగా ఉంచారు.

Rajinikanth upcoming movie update

తాజా సమాచారం ప్రకారం.. వీరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ పాన్‌ ఇండియా రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రాబోతున్నట్లు సమాచారం.

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×