BigTV English

Rajiv Gandhi Case Convict Santhan : రాజీవ్‌ హత్య కేసు దోషి శాంతన్ గుండెపోటుతో మృతి.. శ్రీలంకకు మృతదేహం తరలింపు!

Rajiv Gandhi Case Convict Santhan : రాజీవ్‌ హత్య కేసు దోషి శాంతన్ గుండెపోటుతో మృతి.. శ్రీలంకకు మృతదేహం తరలింపు!

 


Santhan

Rajiv Gandhi Case Convict Santhan Died: భారత్ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషిగా ఉన్న శాంతన్ మృతి చెందాడు. 55 ఏళ్ల శాంతన్ శ్రీలంక దేశీయుడు. అతడికి సుతేంద్ర రాజా అనే మరో పేరు కూడా ఉంది. రాజీవ్ హత్య కేసులో దోషిగా తేలిన తర్వాత చాలాకాలం జైలులో ఉన్న అతడు.. 2022లో విడుదలయ్యాడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో బయటకు వచ్చాడు. అప్పటి నుంచి తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని స్పెషల్ శిబిరంలో ఉంటున్నాడు.


శాంతన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. లివర్ ఫెయిల్యూర్ అయ్యింది. దీంతో అప్పటి నుంచి చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పటల్ లో చికిత్స పొందాడు. ఈ క్రమంలో గుండెపోటు గురయ్యాడు. బుధవారం ఉదయం శాంతన్ మరణించాడని డాక్టర్లు ప్రకటించారు.

తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఈ ఘటన 1991 మే 21న జరిగింది. ఆ రోజు థను అనే ఎల్టీటీఈ ఉగ్రవాది సూసైడ్ బాంబర్ గా మారింది. ఆ ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో సహా 14 మంది మరణించారు.

Read More: ఈడీ సమన్లకు వ్యక్తులు తప్పనిసరిగా హాజరు కావాలి.. సుప్రీం కీలక ఆదేశాలు..

రాజీవ్ హత్య కేసు దర్యాప్తు సుధీర్ఘకాలం సాగింది. ఏడుగురు నిందితులు న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అందులో పేరరివాళన్ , శాంతన్ , మురుగన్ ఈ ముగ్గురు దోషులకు విధించిన మరణశిక్షను 2014లో న్యాయస్థానం జీవితఖైదుగా మార్చింది. ఆ తర్వాత 8 ఏళ్లకు సుప్రీంకోర్టు ఆదేశాలతో శాంతన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతడు శ్రీలంక చెందినవాడు కావడంతో మృతదేహాన్ని అక్కడికి తరలించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×