BigTV English
Advertisement

Janaka Aithe Ganaka : సినిమా రిలీజ్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ప్లాన్ చేసారు

Janaka Aithe Ganaka : సినిమా రిలీజ్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ప్లాన్ చేసారు

Janaka Aithe Ganaka : తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. దిల్ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టిన రాజు ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను చేసారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించాయి. ఐదు ఆరు సినిమాలు మినహాయిస్తే ఈ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేయలేదని చెప్పాలి. ఇక రీసెంట్ టైమ్స్ లో దిల్ రాజు గారి జడ్జిమెంట్ కొంతమేరకు తప్పింది అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అలానే సినిమా ఫలితాలు కూడా అది నిజమే అని నిరూపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి అనుసంధానంగా దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ బ్యానర్ లో రెండు సినిమాలు వచ్చాయి. వీటిలో వచ్చిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వేణు లాంటి గొప్ప దర్శకుడు దొరికాడు అని చాలామంది ప్రశంసలు కురిపించారు.


ఇక కేవలం సినిమాలను నిర్మించడమే కాకుండా సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉంటారు దిల్ రాజు. ఇక సుహాస్ హీరోగా నటిస్తున్న “జనక అయితే గనక” సినిమా అక్టోబర్ 12న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ విషయంలో పెద్ద ప్లాన్ వేసారు రాజు. మొదట ఈ సినిమాను విజయవాడలో అక్టోబర్ 6వ తారీఖున సుహాస్ కోరిక మేరకు వేయనట్లు తెలిపారు. ఆ తర్వాత డైరెక్టర్ కోరిక మేరకు తొమ్మిదో తారీఖున తిరుపతిలో ఒక షో వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇండియాలో కంటే ముందు అమెరికాలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు దిల్ రాజు తెలిపారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన “హ్యాపీడేస్”, “శతమానం భవతి సినిమాలు” ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శతమానం భవతి సినిమా చాలా పెద్ద సినిమాల మధ్యలో వచ్చి కూడా ఇంపాక్ట్ చూపించింది. ఈ రెండు సినిమాలను మొదటగా అమెరికాలో రిలీజ్ చేశారు దిల్ రాజు. ఇప్పుడు జనక అయితే గనక సినిమాను కూడా మొదట అమెరికాలో రిలీజ్ చేసి ఆ తర్వాత అక్టోబర్ 12 వ తారీఖున ఇక్కడ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తానికి రిలీజ్ విషయంలో పర్ఫెక్ట్ ప్లాన్ చేశారు. ఇదంతా కంటెంట్ ని నమ్మడం వల్ల వచ్చిన ధైర్యం అని చెప్పాలి.


ఇక ప్రస్తుతం సుహాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ముందుగా యూట్యూబ్ వీడియోస్ తో కెరియర్ స్టార్ట్ చేసిన సుహాస్. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించి, కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ సుహాస్ విపరీతమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఇక సుహాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఆ సినిమా మంచి కాన్సెప్ట్ అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×