BigTV English

Rain Alert: రేపటి నుండి వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలలో మాత్రం అంతంత మాత్రమే.. మరికొన్ని జిల్లాలలో..

Rain Alert: రేపటి నుండి వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలలో మాత్రం అంతంత మాత్రమే.. మరికొన్ని జిల్లాలలో..

Rain Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రేపటి నుండి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైతం సూచించింది. పలు జిల్లాలలో మోస్తారు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన విడుదలైంది.


కాగా ఏపీలోని ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ ప్రకటన విడుదల చేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ప్రజలు వర్షాలు కురిసిన సమయంలో వాగులు, వంకలు దాటరాదని, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. రైతులు కూడా వ్యవసాయ పనుల నిమిత్తం వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్ళిన సమయంలో.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పాఠశాలలు సెలవులు కాబట్టి.. పిల్లలు వాగులు, నీటి కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.


Also Read: Big TV Exclusive : బిగ్ బాస్ హౌస్ నుంచి ఆదిత్య ఓం ఎలిమినేట్.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే?

ఇక,
తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆలాగే ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను సైతం జారీ చేశారు.

5వ తేదీన నిజామాబాద్, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 6 నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతారణ కేంద్రం తెలిపింది.

మరి వాతావరణ శాఖ అధికారులు అందించిన సూచనల మేరకు ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పిడుగులు పడే సమయంలో ముందస్తు జాగ్రత్తగా.. బయటికి వెళ్లకుండా ఉంటే అదే క్షేమమని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మనం తీసుకొనే ముందస్తు జాగ్రత్తలే మనల్ని ప్రమాదం నుండి రక్షిస్తాయని ప్రజలు సూచనలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు. మరి వర్షాలు కురిసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించండి సుమా !

Related News

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Big Stories

×