BigTV English
Advertisement

RC 16 Janhvi Kapoor: బర్త్ డే స్పెషల్ పోస్టర్..జాన్వీ చేతిలో బుజ్జి మేకపిల్ల..!

RC 16 Janhvi Kapoor: బర్త్ డే స్పెషల్ పోస్టర్..జాన్వీ చేతిలో బుజ్జి మేకపిల్ల..!

RC 16 Janhvi Kapoor.. దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi ) బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ (Boney Kapoor) పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. గతేడాది టాలీవుడ్ లో ఎన్టీఆర్(NTR ), కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈమె.. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సనా (Bucchibabu sana) కాంబినేషన్లో వస్తున్న ఆర్సి 16 (RC 16) సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే ఈరోజు ఈమె పుట్టినరోజు కావడంతో ఆర్సి 16 చిత్ర బృందం ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆర్సి 16 నుండి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.


రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ RC 16..

అసలు విషయంలోకి వెళ్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆర్ సి 16 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఉప్పెన (Uppena) లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత చరణ్ కోసం ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేశాడని సమాచారం. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక కొత్త అవతారంలో కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో రాబోతుండడంతో అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి స్టార్ కాస్ట్ కూడా భారీగా ఉండని తెలుస్తోంది.


జాన్వీ కపూర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన టీం..

ఇక ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (Sivaraj kumar), టాలీవుడ్ టాలెంటెడ్ హీరో జగపతిబాబు (Jagapati babu) దివ్యేందు శర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తూ ఉండగా.. సినిమాటోగ్రఫీకి రత్నవేలు పనిచేస్తూ ఉండడం గమనార్హం. ఇక సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ టైటిల్ అనౌన్స్మెంట్ రామ్ చరణ్ పుట్టినరోజు నాడు అనగా మార్చి 27న ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈరోజు జాన్వి పుట్టినరోజు కావడంతో ఆమెకు చిత్ర బృందం ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. సినిమా షూటింగ్స్ స్పాట్లో కాకుండా చేతిలో మేక పిల్లను పట్టుకుని ఉన్న ఒక స్టన్నింగ్ లుక్ లో జాన్వి ఉన్న ఫోటోని తాజాగా విడుదల చేశారు. ఇందులో ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్ , ట్రెడిషనల్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక షూటింగ్ కి సంబంధం లేని ఈ లుక్కుని చూస్తే జాన్వి ఇందులో చాలా అందంగా, అల్లరిగా కనిపించనున్నట్లు స్పష్టం అవుతోంది. మొత్తానికైతే ఈ సినిమాతో భారీ హిట్ సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది జాన్వి కపూర్.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×