Guava Leaves For Hair: జామ ఒక రుచికరమైన, పోషకాలు కలిగిన పండు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. జామ పండు మాత్రమే కాదు ఆకులు కూడా అంతే మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. జామ ఆకులను జుట్టుకు క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. మరి జామ ఆకుల ఉపయోగాలు, వాటిని జుట్టుకు ఎలా ఉపయోగించాలనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు మూలాలను బలోపేతం చేయడం: జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి , విటమిన్ సి ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.
చుండ్రు, తలపై చర్మ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం: జామ ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి తలపై చర్మాన్ని శుభ్రపరచడంలో, మురికి , బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. దీనివల్ల చుండ్రు , తలపై ఇన్ఫెక్షన్ సమస్య తగ్గుతుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: జామ ఆకులు జుట్టు మూలాలను పోషించి, వాటిని బలంగా చేస్తాయి. తద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. దీనిలో ఉండే పోషకాలు జుట్టును రిపేర్ చేయడంలో, చివర్లు చిట్లే సమస్యను నిరోధించడంలో సహాయపడతాయి.
జుట్టును మందంగా, మెరిసేలా చేయడం: జామ ఆకులలో ఉండే విటమిన్ సి , ఇతర పోషకాలు జుట్టును మెరిసేలా, మందంగా చేయడంలో సహాయపడతాయి. దీనిని తరచుగా వాడటం వల్ల జుట్టును తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
జామ ఆకులను ఎలా ఉపయోగించాలి ?
జామ ఆకులు:
కొన్ని జామ ఆకులను తీసుకుని కాస్త నీటిలో మరిగించి చల్లారనివ్వండి. ఈ నీటిని తలకు, జుట్టుకు బాగా అప్లై చేసి కొంత సమయం తర్వాత జుట్టును వాష్ చేయండి. ఇది జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది జుట్టును క్లీన్ చేసి దాని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తరచుగా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా జామ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి.
జామ ఆకుల పేస్ట్: కొన్ని తాజా జామ ఆకులను తీసుకుని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. చుండ్రు సమస్యతో ఇబ్బంది పడే వారు జామ ఆకుల పేస్ట్ జుట్టు వాడటం చాలా మంచిది.
Also Read: ఇలా చేస్తే.. నల్లగా మారిన పాత్రలు కూడా క్షణాల్లోనే తెల్లగా మెరిసిపోతాయ్ !
జామ ఆకుల ఆయిల్: జామ ఆకులను తీసుకుని వాటిని కొబ్బరి నూనెలో వేసి కొంత సేపు మరిగించి, తలకు పట్టించి మసాజ్ చేసి కొన్ని గంటల తర్వాత తలస్నానం చేయండి. ఇది జుట్టును మృదువుగా, మందంగా, మెరిసేలా చేస్తుంది. జామ ఆకులను బాదం నూనెలో వేసి కూడా మరిగించి వాడవచ్చు. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.