BigTV English

Jani Master Case : జానీ మాస్టర్ చేసిన తప్పు అదే… ఎట్టకేలకు నిజం బయట పెట్టిన భార్య

Jani Master Case : జానీ మాస్టర్ చేసిన తప్పు అదే… ఎట్టకేలకు నిజం బయట పెట్టిన భార్య

Jani Master Case : అత్యాచార ఆరోపణల కేసులో జైలుకు వెళ్లిన కొరియోగ్రాఫర్ జానీ గురించి భార్య ఎట్టకేలకు నోరు విప్పింది. ఆయన చేసిన తప్పు ఇదే అంటూ అసలేం జరిగిందన్న విషయాన్ని బయట పెట్టింది. మరి జానీ మాస్టర్ భార్య బయట పెట్టిన ఆ నిజాలు ఏంటో తెలుసుకుందాం పదండి.


జానీ మాస్టర్ చేసిన తప్పు అదే అంటున్న భార్య

నేషనల్ అవార్డు విన్నర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అతడిని హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకొని ఈ కేసును విచారిస్తున్న నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరు పరచగా, కోర్టు 14 రోజుల పాటు అతనికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు. అయితే జైలుకు వెళ్లడానికంటే ముందు తాను లీగల్ గా పోరాడతానని చెప్పిన జానీ మాస్టర్ తరువాత లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఒప్పుకున్నాడు అని వార్తలు వచ్చాయి.


ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ భార్య ఆయేషా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టింది. ఆ అమ్మాయి పెళ్ళి చేసుకోకపోతే చనిపోతా అని బ్లాక్ మెయిల్ చేసిందని, మతం మార్చుకోవడానికి కూడా రెడీ అని జానీ మాస్టర్ తో చెప్పిందని ఆయేషా వెల్లడించింది. అయితే జానీ మాస్టర్ చేసిన తప్పు అదే, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అంటూ బాధితురాలి గురించి ఎవ్వరికీ తెలియని విషయాన్ని బయట పెట్టింది.

Jani Master: జానీ మాస్టర్ భార్యపై మరో కేసు.. అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు! కారణమిదే - Telugu News | Hyderabad Police Officials Are Ready To Register A Case Against Jani Master Wife ...

జానీ నుంచి గోల్డ్, క్యాష్ తీసుకుందా?

బాధితురాలు వదిన, బావ అంటూ తమకు దగ్గరైందని, ఆ తరువాత అనుమానం కూడా రాకుండా డబుల్ గేమ్ ప్లే చేసిందని వెల్లడించింది ఆయేషా. విషయం తెలిసి “ఇది కరెక్ట్ కాదని పిలిచి మాట్లాడాను. మంచిగా చెప్పాను” అంటూ కొత్త విషయాన్ని బయట పెట్టింది. అదే సమయంలో ఆమె జానీ దగ్గర నుంచి బంగారం, క్యాష్ తీసుకుందని, తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని సంచలన విషయాలు బయట పెట్టింది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డబ్బులు తీసుకున్నారని చెప్పింది. “ఏ తల్లయిన పెళ్ళైన మగాడి దగ్గరకు కూతుర్ని పంపదు. ఇది పక్కాగా హనీ ట్రాప్, దాని వల్ల నేను ఆత్మహత్య ప్రయత్నం చేసి, పిల్లలకు దూరం అయ్యాను” అంటూ జానీ మాస్టర్, బాధితురాలి మధ్య సంబంధం ఉందని చెప్పకనే చెప్పింది ఆయేషా.

ఆయేషా మెడకు బిగుస్తున్న ఉచ్చు… 

కాగా జానీ మాస్టర్ భార్య మెడకు కూడా ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. ఆయేషా పై తాజాగా మరో కేసు నమోదైంది. ఆమె తాజాగా బాధితురాలి ఇంటికి వెళ్లి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారని, ఆమెతో పాటు జానీ మాస్టర్ కు సంబంధించిన మరో ఇద్దరు అసిస్టెంట్స్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తన భర్తను లాక్కోవాలి అని చూసినందుకు ఒక్కసారి కొట్టాను ఆమె కూడా ఒప్పుకుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×