BigTV English

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Bhadra rajyog 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ చివర వారంలో భద్ర రాజయోగం ఏర్పడుతోంది. సెప్టెంబర్ 22వ తేదీన బుధుడు కన్యారాశిలో ప్రవేశించనున్నాడు. కన్యారాశిలో బుధుడు సంచరించినప్పుడు భద్ర రాజయోగం ఏర్పడుతుంది. పంచ మహాపురుష రాజయోగాలలో భద్ర రాజయోగం ఒకటి. ఈ రాజయోగం ఏర్పడటంతో 12 రాశులపై ప్రభవం ఉంటుంది.


ముఖ్యంగా కొన్ని రాశులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశుల వారు అపారమైన విజయాన్ని, ఆర్థిక లాభాలను పొందుతారు. కాబట్టి భద్ర రాజ్యయోగం ఏర్పడటం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతే కాకుండ ఏ రాశుల వారు తమ ప్రేమ జీవితంలో సంతోషాన్ని పొందబోతున్నారో కూడా తెలుసుకుందాం.

మేష రాశి:


భద్ర రాజయోగం మేష రాశి వారికి వారికి చాలా శుభప్రదమైనది. ఎందుకంటే ఈ సమయంలో, మేషరాశి వారు అనేక రోజులుగా ఎదుర్కుంటున్న అనారోగ్య లేదా ఇతర శారీరక బాధల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే మీ సహోద్యోగులు మీ పనిలో వచ్చే అడ్డంకులను కూడా తొలగిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త అందుతుంది. కుటుంబ సమేతంగా మీరు మతపరమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. యువత ఈ సమయాన్ని సరదాగా గడుపుతారు. మీరు మీ భాగస్వామి నుండి చాలా ప్రేమను పొందుతారు.

మిధున రాశి:

భద్ర రాజయోగ ప్రభావం మిధున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో, మీరు మీ జీవితంలో కొత్త అవకాశాలను పొందుతారు. మీ కలలన్నీ నిజమవుతాయి. వ్యాపారంలో కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి. కానీ ఈ సమయంలో మీరు డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టండి. లేదా నిపుణుల సలహా తీసుకోండి. సెప్టెంబర్ చివరి నాటికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అదే సమయంలో పెళ్లి చేసుకున్న వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి భావాలను బాగా అర్థం చేసుకోవాలి. అత్తమామల నుంచి కూడా శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి.

Also Read: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

మీన రాశి:

సెప్టెంబర్ నెలాఖరులో ఏర్పడే భద్ర రాజయోగ ప్రభావం మీన రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు అదృష్టం పెరుగుతుంది. అలాగే అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. డబ్బు ఆకస్మికంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఇంట్లో కోరుకున్న లేదా చాలా కాలంగా ఎదురుచూసిన వస్తువుల నుంచి ఆనందం పెరుగుతుంది. వ్యాపారంలో భారీ పెరుగుదల ఉంటుంది. ఈ నెలాఖరులో మీరు ఒక పెద్ద వ్యాపారవేత్తను కలిసే అవకాశం ఉంది. డబ్బు ఖర్చు కాస్త ఎక్కువగానే ఉంటుంది. జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు పెరుగుతుంది. అంతే కాకుండా మీ శ్రమకు తగిన ఫలితం మీకు లభిస్తుంది . ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులకు ఇది మంచి సమయం.

 

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×