E-Paper
Advertisement

Pushpa 2: ‘పుష్ప 2’ నుండి జానీ మాస్టర్ ఔట్

Pushpa 2: ‘పుష్ప 2’ నుండి జానీ మాస్టర్ ఔట్
Advertisement

Pushpa 2: మామూలుగా స్క్రీన్ వెనుక ఉండే కొరియోగ్రాఫర్స్‌కు అంతగా గుర్తింపు లభించదు. కానీ బుల్లితెరపై పలుమార్లు కనిపించడం, వారు చేసిన స్టెప్పులకు హీరోలు క్రెడిట్ ఇవ్వడం వల్లే వారికి గుర్తింపు వస్తుంది. అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో జానీ మాస్టర్ ఒకరు. జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని అందరికీ తెలిసిన విషయమే. పర్సనల్‌గా ఈ మాస్టర్‌తో మెగా హీరోలు ఎలా ఉన్నా కూడా వారు చేసే ప్రతీ సినిమాలో తను ఒక సాంగ్‌కు కొరియోగ్రాఫీ చేసేవాడు. అలాంటిది ‘పుష్ప 2’ నుండి జానీ మాస్టర్ ఔట్ అనే వార్త తాజాగా బయటికొచ్చింది. దీంతో చాలామంది ప్రేక్షకులు షాకవుతున్నారు.

సపోర్ట్ ఇవ్వలేదు

Advertisement

అల్లు అర్జున్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని, జానీ మాస్టర్‌ను తప్పిస్తాడని చాలామంది ఊహించలేదని అంటున్నారు. కానీ ప్రస్తుతం జానీ మాస్టర్‌పై ఉన్న కేసుల కారణంగా తనను ఇండస్ట్రీ దూరం పెట్టక తప్పదు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ, అందులోని అల్లు అర్జున్ కూడా అదే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు గురించి బయటికి రాగానే అల్లు అర్జున్ తనకే సపోర్ట్‌గా నిలబడ్డనున్నారనే వార్త బయటికొచ్చింది. కానీ బన్నీ మాత్రం దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇక మెగా హీరోలు అయితే దీనిపై అసలు స్పందించడానికే ముందుకు రాలేదు.

Also Read: ‘పుష్ప 2’ రిలీజ్ డేట్‌లో మార్పులు.. షాక్‌లో బన్నీ ఫ్యాన్స్

Advertisement

ఫ్యాన్స్‌కు క్లారిటీ

కొన్నాళ్ల తర్వాత అసలు జానీ మాస్టర్ కేసులో మాస్టర్‌ను అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన ఆస్థాన నిర్మాతలు ప్రకటించారు. కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీ, మెగా హీరోల చుట్టూ ఏదో ఒక కాంట్రవర్సీ తిరుగుతుండగా.. జానీ మాస్టర్ కేసు విషయంలో కూడా ప్రేక్షకులంతా మెగా ఫ్యామిలీ స్పందనే చూడాలని ఎదురుచూశారు. కానీ వారెవ్వరూ దీనిపై నేరుగా స్పందించలేదు. పరోక్షంగా కూడా స్పందించడానికి ట్రై చేయలేదు. కానీ ఈ కేసు వల్ల జానీ మాస్టర్ కెరీర్‌పై గట్టి దెబ్బే పడింది. మెగా హీరోలు మాత్రమే కాదు.. ఇంకా ఏ ఇతర మేకర్స్ కూడా ఆయనకు కొరియోగ్రాఫర్‌గా తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.

అవకాశాలు కష్టమే

ప్యాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నాడు జానీ మాస్టర్. బాలీవుడ్ స్టార్లు సైతం జానీ మాస్టర్ స్పెప్పులకు ఫిదా అయ్యి ఆయనే కావాలని ఏరికోరి ఎంచుకునేవారు. ఆ రేంజ్‌కు ఎదిగిన తర్వాత తన అసిస్టెంట్‌పై అత్యాచారం చేశాడనే విషయంలో ఒక్కసారిగా తనకు ఎదురుదెబ్బ తగిలింది. తనపై కేసు నమోదవ్వడం, జైలు జీవితాన్ని గడపడం, పలుమార్లు బెయిల్ రిజెక్ట్ అవ్వడం.. ఇవన్నీ జరగడం వల్ల జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డ్ కూడా రద్దయ్యింది. అసలైతే ఈ ఏడాది బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డ్‌ను అందుకోవాల్సింది జానీ మాస్టర్. కానీ ఈ కేసు వల్లే తనకు నేషనల్ అవార్డ్‌ను కూడా రద్దు చేశాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ నుండి కూడా తొలగించారు. ఇకపై తనకు అవకాశాలు వస్తాయో రావో కూడా డౌటే అంటున్నారు ప్రేక్షకులు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×