BigTV English
Advertisement

Pushpa 2 The Rule : మెగా ఫ్యామిలీ లో విభేదాలు పుష్పా పై ప్రభావం చూపిస్తాయా ?

Pushpa 2 The Rule : మెగా ఫ్యామిలీ లో విభేదాలు పుష్పా పై ప్రభావం చూపిస్తాయా ?

Pushpa2 The Rule : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్ లో పుష్ప 2 ఒకటి. ఇదివరకే రిలీజ్ అయిన పుష్ప సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది పొలిటికల్ పర్సన్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా ఈ సినిమాలోని డైలాగ్స్ ని విపరీతంగా వాడారు. అలానే అల్లు అర్జున్ మేనరిజమ్స్ కూడా యూస్ చేశారు. అందువలన ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఖచ్చితంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ భారీ ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా మరోసారి ప్రకటించింది.


ఇకపోతే పుష్ప సినిమా నుంచి పుష్ప 2 సినిమా మధ్యలో చాలా మార్పులు వచ్చాయి. తెలుగు సినిమా మార్కెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అలానే అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ రావడం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వటం ఇలా చాలా జరిగాయి. అయితే పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో ఎంతటి విమర్శలను ఎదుర్కొన్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలు రిలీజ్ అయినా కూడా సరైన టికెట్ కాస్ట్ కూడా దొరికేది కాదు. అటువంటి ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ ఫైట్ చేసి నేడు డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నాడు. అయితే ఆ పార్టీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గరికి అల్లు అర్జున్ వెళ్లి సపోర్ట్ చేయడం అనేది చాలామంది మెగా అభిమానులకు జీర్ణించుకోలేని విషయంగా మారింది.

ఇదే విషయం పైన ట్విట్టర్ వేదిక ఇన్ డైరెక్ట్ గా మెగా బ్రదర్ నాగబాబు కొన్ని సెటైర్లు కూడా వేశారు. అలానే అల్లు అర్జున్ కూడా ఒక సందర్భంలో నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా అని మాటలు కూడా చాలా వైరల్ గా మారాయి. అయితే బయటికి చెప్పకపోయినా కూడా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయని నిత్యం కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ లో వచ్చిన విభేదాలు పుష్పా 2 సినిమాపై ఏమైనా ప్రభావం చూపిస్తాయా అని చిత్ర యూనిట్ ని ఒక సీనియర్ జర్నలిస్ట్ క్వశ్చన్ చేసింది.


దీనిపై నిర్మాతలు స్పందిస్తూ రాజకీయాలకు సినిమాలకు ముడి పెట్టకండి. సినిమా దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒకటే అంటూ నవీన్ చెప్పుకొచ్చారు. దీనిని కంటిన్యూ చేస్తూ రవిశంకర్ మాట్లాడుతూ అసలు రాజకీయాలకి ఈ సినిమాకి సంబంధం లేదు అలానే హీరో గారు కూడా ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు ఏదైనా సినిమాను సినిమాలా చూడాలి అంటూ ఆన్సర్ ఇచ్చారు. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ రోజులు కూడా లేవు కాబట్టి ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఇంకా వరుసగా వస్తూనే ఉంటాయని కూడా తెలిపారు. అలానే ఈ సినిమా చాలా గ్రాండ్ గా ఉండబోతుందని మరోసారి గుర్తు చేశారు. ఈ సినిమాకి జాతర సీన్స్ హైలెట్ కానున్నట్లు తెలిపారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×