BigTV English

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

Washington Sundar: ఇండియా ( Team india ) వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand ) మధ్య జరుగుతున్న రెండవ టెస్టులో… రోహిత్ సేన అదరగొట్టింది. కొత్తగా వచ్చిన వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) దెబ్బకు న్యూజిలాండ్ కుప్పకూలింది. టీమిండియా యంగ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు… తొలిరోజు 259 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. వాస్తవంగా ఒక దశలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసిన న్యూజిలాండ్…చాలా బలంగా కనిపించింది.


Washington Sundar throttles New Zealand after picking 7 wickets in Pune Test

మళ్లీ భారీ స్కోర్ చేస్తుందని అందరూ…అనుకున్నారు. కానీ అదే సమయంలో…. న్యూజిలాండ్ జట్టును తీవ్రంగా దెబ్బతీశాడు…వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ). మొత్తం 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. అటు న్యూజిలాండ్ జట్టులో డేవాన్ కాన్వే 76 పరుగులు చేసి రాణించాడు.అలాగే రచిన్ రవీంద్ర 65 పరుగులతో మళ్లీ దుమ్ము లేపాడు. వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) ఏడు వికెట్లు తీయగా రవిచంద్రన్ అశ్విన్ ( ashwin ) 3 వికెట్లు తీసి…కివిస్ జట్టును దెబ్బతీశారు.

Also Read: Glasgow Commonwealth Games 2026: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !


ఇది ఇలా ఉండగా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) టీమిండియాలోకి వచ్చాడు. ఈ మూడు సంవత్సరాల పాటు సుందర్ కు ఎక్కడ అవకాశాలు రాలేదు. ఎక్కువ శాతం వన్డేలు అలాగే t20లో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు సుందర్ ( Washington Sundar ) . అయితే టీమిండియా కు కొత్తగా కోచ్గా వచ్చిన గౌతమ్ గంభీర్…చాలా రకాల ప్లాన్స్ చేస్తున్నారు. జట్టులో ఛాన్స్ లేని వారికి ఛాన్సులు ఇస్తూ…వారిలో ఉన్న టాలెంట్ను బయటకు తీస్తున్నారు గంభీర్. ఈ తరుణంలోనే మూడు సంవత్సరాల తర్వాత… ప్రత్యేకంగా సుందర్ ను తీసుకున్నారు గౌతమ్ గంభీర్.

Also Read: IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… కర్ణాటక ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలని కాంగ్రెస్ హుకుం ?

గౌతమ్ గంభీర్ సూచనల మేరకు… భారత క్రికెట్ నియంత్రణ మండలి మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే గౌతమ్ గంభీర్ ( Gutam Gambhir )  …సలహాను గౌరవించిన…భారత క్రికెట్ నియంత్రణ మండలి…వెంటనే వాషింగ్టన్ సుందర్ ను రప్పించింది. దానికి తోడు కుల్దీప్ యాదవ్ను పక్కకు తప్పించి వాషింగ్టన్ సుందరకు తుది జట్టులో అవకాశం కల్పించారు.

Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

ఇక జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని వాషింగ్టన్ సుందర్ నిరూపించుకున్నాడు. ఇవాళ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి రఫ్పాడించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కు అర్హత సాధించాలంటే కచ్చితంగా ప్రతి టెస్ట్ గెలవాల్సిందే. అందుకే వాషింగ్టన్ సుందర్ ను బరిలోకి దింపి… గౌతమ్ గంభీర్ ( Gutam Gambhir ) కూడా బాగా వాడుకున్నారు. కాగా మొదటి టెస్టులో…న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Related News

BCCI : బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా.. ప్ర‌పంచంలోనే రిచ్..!

Pakisthan Blast : క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Asia Cup 2025 jersey : టీమిండియా న్యూ జెర్సీ వచ్చేసింది… జెర్సీ లేకుండానే.. ఫోటోలు చూసేయండి

Asia Cup 2025 : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై బీసీసీఐ సంచలన ప్రకటన.. నెత్తురు మరుగుతోందని అభిమానుల ఆగ్రహం

Asia Cup 2025 : ఆసియా క‌ప్ 2025 జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

Neymar Junior : రూ.10వేల కోట్ల ఆస్తి.. ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చేసిన బిలియనీర్‌

Big Stories

×