BigTV English

Pushpa 2 Release Date: ‘పుష్ప 2’ రిలీజ్ డేట్‌లో మార్పులు.. షాక్‌లో బన్నీ ఫ్యాన్స్

Pushpa 2 Release Date: ‘పుష్ప 2’ రిలీజ్ డేట్‌లో మార్పులు.. షాక్‌లో బన్నీ ఫ్యాన్స్

Pushpa 2 Release Date: సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా పాపులారిటీ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) మ్యానరిజం, డైలాగ్స్.. ఇవన్నీ ప్యాన్ ఇండియా మాత్రమే కాకుండా ప్యాన్ వరల్డ్‌లో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో అసలు ‘పుష్ప 2’లో ఏం జరుగుతుందా అనే ఆసక్తి అందరికీ పెరిగింది. అందుకే గత మూడేళ్లుగా ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ప్రతీసారి విడుదల తేదీ ప్రకటించడం, దానిలో మార్పులు చేయడం.. ఇదే జరుగుతూ వచ్చింది. మరోసారి కూడా అదే జరిగింది.


మాట మార్చారు

‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ గతేడాది డిసెంబర్‌లోనే విడుదల అవుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో ఆశలు క్రియేట్ చేశారు మేకర్స్. కానీ అది కుదరదని అర్థమయ్యింది. పోనీ సంక్రాంతి బరిలో దిగుదామంటే అప్పటికే గట్టి పోటీ ఏర్పడింది. ఫైనల్‌గా ఆగస్ట్ 15న సినిమా రావడం పక్కా అని మాటిచ్చారు మేకర్స్. చివరి నిమిషంలో ఆ విడుదల తేదీ నుండి ‘పుష్ప 2’ తప్పుకుంది. దీంతో ఈ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఉన్న అంచనాలు తగ్గిపోతూ వచ్చాయి. వారిలో మళ్లీ హైప్ క్రియేట్ చేయడం కోసం ఒక స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఆపై ఈ మూవీ డిసెంబర్ 6న విడుదల అవుతుందని ప్రకటించారు. ఇప్పుడు మరోసారి మాట మార్చారు ‘పుష్ప 2’ మూవీ టీమ్.


Also Read: జానీ మాస్టర్ కి బెయిల్.. సంతోషంలో కుటుంబ సభ్యులు..!

ప్రెస్ మీట్‌లో ప్రకటన

డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 5కు ‘పుష్ప 2’ సినిమా పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ సినిమా గురించి క్లారిటీ ఇవ్వడం కోసం భారీ ఎత్తున ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది మూవీ టీమ్. ఈ ప్రెస్ మీట్‌కు అల్లు అర్జున్ హాజరు కాలేకపోయినా ఇతర మూవీ టీమ్ అంతా వచ్చి అఫీషియల్‌గా ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుందని ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఒకవైపు షాక్‌లో ఉండగా మరోవైపు ఆనందంలో ఉన్నారు. అసలు ఈ సినిమా డిసెంబర్ 6న అయినా విడుదల అవుతుందా లేదా అని సందేహంలో ఉన్న ఫ్యాన్స్‌కు ఇదొక గుడ్ న్యూస్‌లాగా వినిపించింది. వాళ్లు అనుకున్న దానికంటే ఒకరోజు ముందే తమ అభిమాన హీరోను తెరపై చూడవచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏడాదికే వచ్చేది

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’.. 2021 డిసెంబర్ 17న విడుదలయ్యింది. అయితే సరిగ్గా ఏడాదిలో.. అంటే 2022లోనే పార్ట్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని మాటిచ్చారు మేకర్స్. ఆ సంవత్సరం దాటి మరొక సంవత్సరం అయ్యింది. మధ్యలో సుకుమార్‌కు, అల్లు అర్జున్‌కు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు వచ్చాయి. ‘పుష్ప 2’ షూటింగ్ రోజురోజుకీ లేట్ అవుతుండగా ఇక ఆ సినిమపై తనకు సంబంధం లేదని బన్నీ వెళ్లిపోయాడని కూడా రూమర్స్ వినిపించాయి. ఫైనల్‌గా అవన్నీ నిజాలు కాదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ‘పుష్ప 2’ను ఒకరోజు ముందే విడుదల చేసి ప్యాన్ వరల్డ్ ప్రేక్షకులను మరింత హ్యాపీ చేయనున్నారు.

Pushpa 2 Release Date
Pushpa 2 Release Date

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×