BigTV English

Jani Master : లీగల్‌గా పోరాడుతా.. లైంగిక ఆరోపణలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జానీ మాస్టర్

Jani Master : లీగల్‌గా పోరాడుతా.. లైంగిక ఆరోపణలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జానీ మాస్టర్

Jani Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. వర్క్ ప్లేస్ లో తనను అసభ్యకరంగా తాకుతూ లైంగికంగా వేధించడమే కాకుండా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారనే ఆరోపణలతో జానీ మాస్టర్ పై సదరు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత జానీ మాస్టర్ పరారీలో ఉండగా , సమాచారం అందుకున్న పోలీసులు గోవాలో అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. అయితే ఫస్ట్ టైం జానీ మాస్టర్ ఈ వివాదంపై స్పందించారు. తను ఎవరిపై ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదంటూ పేర్కొన్నారు జానీ మాస్టర్. గతంలో ఆయన భార్య స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే జానీ మాస్టర్ కూడా ఎవరో కొంతమంది కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేస్తున్నారని మరో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాకుండా లీగల్ గా పోరాడుతాను అంటూ ఫస్ట్ టైం ప్రెస్ వివాదంపై రెస్పాండ్ అయ్యారు.


ఫస్ట్ టైం రెస్పాండ్ అయిన జానీ మాస్టర్

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు మార్మోగిపోతుంది. 21 ఏళ్ల అసిస్టెంట్ మహిళ కొరియోగ్రాఫర్ పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో జానీ బాషా పై ఐపిసి 376 (2), 506, 323 సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఈ వివాదం పై పలువురు సెలబ్రిటీలు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే జానీ మాస్టర్ భార్య ఆయేషా మాత్రం ఎవరో కావాలని తన భర్తపై కుట్ర చేస్తున్నారని, తన భర్త అలాంటి వాడు కాదంటూ వెనకేసుకొచ్చింది. పరారీలో ఉన్న జానీ మాస్టర్ నిన్న గోవాలోని ఓ లాడ్జిలో ఎస్ఓటి పోలీసులకు దొరికాడు. అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి స్థానిక న్యాయ స్థానంలో హాజరు పరిచి, ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఆ తర్వాత నగర శివారులో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో జానీ మాస్టర్ ను పోలీసులు రహస్యంగా విచారించినట్టు టాక్ నడిచింది. ఈ నేపథ్యంలోనే మొదటిసారి జానీ మాస్టర్ తన పై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను అసలు ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెప్పడమే కాకుండా న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు.


Jani Master Arrest: ಲೈಂಗಿಕ ದೌರ್ಜನ್ಯ ಆರೋಪ, ಖ್ಯಾತ ನೃತ್ಯ ನಿರ್ದೇಶಕ ಜಾನಿ ಮಾಸ್ಟರ್‌ ಅರೆಸ್ಟ್‌! | Times Now Kannada

వదిలేస్తాను అంటున్న జానీ మాస్టర్ భార్య

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ పదహారేళ్ల వయసులో రేప్ జరిగింది అనడానికి ప్రూఫ్ ఏంటి? అమ్మాయికి చాలా మంది తో ఎఫైర్స్ ఉన్నాయి? మిగతా కొరియోగ్రాఫర్స్ తో ఎఫైర్ లేదని గ్యారంటీ ఏంటి? అమ్మాయి ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని వదిలేసి వెళ్ళిపోతానని సవాల్ చేసింది. అంతేకాకుండా మిగతా కొరియోగ్రాఫర్స్ భార్యలు ఆ అమ్మాయికి వార్నింగ్ కూడా ఇచ్చారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×