BigTV English

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Fear Teaser.. ఈమధ్య కాలంలో ఆడియన్స్ ఎక్కువగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు హార్రర్ చిత్రాలకు కూడా ఎక్కువగా ఓటు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ యంగ్ గ్లామర్ బ్యూటీ వేదిక. తెలుగులో విజయదశమి, బాణం, ముని, కాంచన వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరైన వేదిక, తెలుగు, తమిళ్ , మలయాళం, కన్నడ భాషలో సినిమాలు చేస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది. సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె, మళ్లీ దాదాపు 5 ఏళ్ల తర్వాత మెయిన్ లీడ్ పోషిస్తూ తెలుగులో మళ్లీ ఎంట్రీ ఇస్తోంది.


పోస్టర్ తో అంచనాలు పెంచేసిన చిత్ర బృందం..

అందులో భాగంగానే తాజాగా మెయిన్ లీడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఫియర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 14వ తేదీన ఫియర్ మూవీ నుంచి వేదిక ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ డైరెక్టర్ , ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా (Prabhudeva )విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ చూస్తుంటే ఒక చీకటి గదిలో హీరోయిన్ భయపడుతూ కూర్చుంది. పోస్టర్ తోనే ప్రేక్షకులలో ఉత్కంఠ రేకెత్తించేలా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించగా, దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ఏ ఆర్ అభి నిర్మించారు. ఈ సినిమాలో నటుడు అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్ పోషిస్తూ ఉండగా.. సత్య కృష్ణ , పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్లా, షాయాజీ సిండే , సాహితీ దాసరి, షానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పూర్తయి పలు ఫిలిం ఫెస్టివల్స్ కి కూడా పంపించగా. అక్కడ దాదాపు 64 ప్రెస్టేజ్ అవార్డులు కూడా గెలుచుకుందని సమాచారం


టీజర్ తోనే సినిమా పై హైప్..

Fear Teaser: Fear Teaser as a suspense thriller..vedhika creates hipe on this movie..!
Fear Teaser: Fear Teaser as a suspense thriller..vedhika creates hipe on this movie..!

ఇదిలా ఉండగా తాజాగా కౌన్ డౌన్ విధిస్తూ సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేసింది చిత్ర బృందం . 12 గంటలకు టీజర్ రాబోతోంది అంటూ కౌంట్ డౌన్ విధించగా తాజాగా టీజర్ విడుదల చేశారు. ఇప్పుడేమో మరోవైపు టీజర్ ను విడుదల చేసి అంచనాలు భారీగా పెంచేశారు మేకర్స్ . మరి ఈ సినిమాతో వేదిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. తాజాగా టీజర్ ను విడుదల చేసిన చిత్ర బృందం 64 ప్రెస్టేజియస్ అవార్డులు గెలుపొందినట్టుగా ప్రారంభంలో చూపించి టీజర్ మొదలుపెట్టారు. ప్రముఖ స్టార్ హీరో రానా చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రాబోతోందని సమాచారం. ఇకపోతే తాజాగా విడుదల చేసిన టీజర్ లో వేదిక తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో సినిమాపై హైప్ తీసుకొచ్చిందని చెప్పవచ్చు. సాధారణంగా హారర్ చిత్రాలకు పెట్టింది పేరు అలాంటిది ఈ సినిమాలో మరొకసారి తన అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచిందని అర్థం అవుతుంది. బాయ్ ఫ్రెండ్ మిస్ అయ్యాడు అంటూ టీజర్ స్టార్టింగ్ లో చూపించగా, ఆ తర్వాత డిక్కీలో డెడ్ బాడీ దొరకడం, అది ఎవరిదో తెలియక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం, చివరికి వేదికను జైల్లో పెట్టడం అన్నీ కూడా సస్పెన్స్ గా సాగాయి మొత్తానికైతే టీజర్ తోనే సినిమాపై హై సస్పెన్స్ క్రియేట్ చేశారు. మొత్తానికి అయితే టీజర్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×