E-Paper
Advertisement

Jani Master: జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు

Jani Master: జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు
Advertisement

Jani Master Mother: టాలీవుడ్‌లో ప్రస్తుతం జానీ మాస్టర్ కేసు విషయం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఇదే సమయంలో కొడుకు జైలుకు వెళ్లడం తట్టుకోలేని జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్‌ కొన్నాళ్లుగా బెంగ పెట్టుకున్నారు. దీంతో తాజాగా ఆమెకు గుండెపోటు వచ్చింది. శనివారం సాయంత్రం బీబీ జాన్‌కు గుండెపోటు రావడంతో స్థానికులంతా కలిసి ఆమెను వెంటనే నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ నెల్లూరులోని తమ స్వగ్రామంలో ఉంటారు. దీంతో అక్కడే దగ్గర్లో ఉన్న బొల్లినేని ఆసుపత్రికి ఆమెను తరలించగా వెంటనే బీబీ జాన్‌ను ఐసీయూలో చేర్చి చికిత్స మొదలుపెట్టారు డాక్టర్లు.

కోడలి తోడు

Advertisement

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా జానీ మాస్టర్ కేసు విషయం గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. చాలామంది సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ప్రేక్షకులు సైతం దీని గురించే నిరంతరం చర్చించుకుంటున్నారు. జానీ మాస్టర్ నిర్దోషా కాదా ఇంకా తెలియాల్సి ఉన్నా.. పోలీసులు మాత్రం తనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో తన కొడుకు పరిస్థితిని చూసి బీబీ జాన్ తట్టుకోలేకపోయారు. జానీ మాస్టర్ జైలుకు వెళ్లినప్పటి నుండి తన గురించే ఆలోచిస్తూ బెంగ పెట్టుకున్నారు. ఆ కారణంగానే ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తల్లిని చూడడం కోసం వెంటనే జైలు నుండి జానీ మాస్టర్ బయటికి రాలేదు. అందుకే జానీ భార్య ఆయేషా హాస్పిటల్‌కు చేరుకొని బీబీ జాన్‌కు తోడుగా ఉన్నారు.

Also Read: అయ్యో పాపం మాస్టర్.. ఆ అమ్మాయి గురించి బయటపడ్డ మరో నిజం..

Advertisement

ఎప్పుడో అరెస్ట్

అసలు జానీ మాస్టర్ నిజంగా తప్పు చేశారా లేదా అనేది చర్చనీయాంశం అయ్యింది. చాలాకాలంగా తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడంటూ జానీపై కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని బాధితురాలే స్వయంగా ముందుకొచ్చి పోలీసులకు తెలిపింది. దీంతో బాధితురాలి దగ్గర నుండి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయ్యి తనను అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు అసలు తాను ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియకుండా చేశాడు జానీ మాస్టర్. ఫైనల్‌గా గోవాలో పోలీసులు.. తనను అదుపులోకి తీసుకున్నారు.

మాస్టర్‌కే మద్దతు

బాధితురాలు చెప్పింది నిజమే అయ్యిండవచ్చని, జానీ మాస్టర్ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని కొందరు ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం అసలు మాస్టర్ అలాంటివాడు కాదని వాదిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు.. జానీ మాస్టర్‌కు మద్దతునివ్వడానికి ముందుకొచ్చారు. బాధితురాలు అబద్ధం చెప్తుందని, డబ్బు కోసమే ఇదంతా చేస్తుందని ఆరోపించారు. కానీ ఇప్పటికీ ఈ కేసులో నిజాలేంటో, ఆరోపణలు ఏంటో తెలియలేదు. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటూ ఉండడంతో జానీ మాస్టర్‌కు రావాల్సిన నేషనల్ అవార్డ్ కూడా రద్దు చేసింది ప్రభుత్వం. మొత్తానికి ఈ కేసు వల్ల జానీ మాస్టర్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడిందని ఫ్యాన్స్ వాపోతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×