BigTV English

Hari Hara Veera Mallu: బాణాలతో వీరమల్లు.. బాహుబలిని గుర్తుచేస్తున్నాడే

Hari Hara Veera Mallu: బాణాలతో  వీరమల్లు.. బాహుబలిని గుర్తుచేస్తున్నాడే

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధానులు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే. పార్టీని నడపడానికి కావల్సిన ఫండ్ కోసం తాను సినిమాలు చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన పవన్.. అందుకోసం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఆ విధంగా వచ్చిన డబ్బుతో ప్రచారంలో పాల్గొని గెలిచాడు. నిర్మాతలు సైతం పవన్ ఎప్పుడంటే అప్పుడు అన్నట్లు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ కూడా .. నిర్మాతలనుగౌరవించి..ఎలా అయినా ఆ సినిమాలను ఫినిష్ చేయాలని చూస్తున్నాడు.


ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి హరిహర వీరమల్లు ఒకటి. AM రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి కొంతభాగం వరకు దర్శకత్వం వహించాడు. చివర క్లైమాక్స్ కు మాత్రం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిష్ వేరే ప్రాజెక్ట్ వలన బిజీగా ఉండడంతో.. హరిహర వీరమల్లు బాధ్యత జ్యోతి కృష్ణ కు అప్పగించారు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్  గా కనిపిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా నేడు దసరా పండగ సందర్భంగా ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ లో  పవన్ కళ్యాణ్ వీరుడిలా కనిపించాడు. నిప్పు అంటించిన బాణాలను.. విసురుతున్నట్లు పవన్ కనిపించాడు. ఒకేసారి నాలుగు బాణాలను ఎక్కుపెట్టి.. సీరియస్ లుక్ లో వీరమల్లు కనిపించాడు. ఇక ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


కొత్త పోస్టర్ ను చూసిన అభిమానులు వీరమల్లును బాహుబలితో పోలుస్తున్నారు. బాహుబలి 2 చిత్రంలో ప్రభాస్.. ఇలానే నాలుగు బాణాలతో యుద్ధం చేస్తూ కనిపిస్తాడు. ఇప్పుడు ఈ రెండు ఫోటోలను పక్కపక్కన పెట్టి.. బాహుబలిగా మారిన హరిహర వీరమల్లు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇకపోతే ఈ సినిమా సమ్మర్ కానుకగా వచ్చే ఏడాది మార్చి 28 న. రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే పవన్.. ఈ సినిమా సెట్ లో సందడి చేయనున్నాడు. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Big Stories

×