BigTV English

Jani Master: నిర్దోషిగానే బయటికొస్తాను, అప్పుడే మాట్లాడతాను.. మళ్లీ అరెస్ట్‌పై జానీ మాస్టర్ రియాక్షన్

Jani Master: నిర్దోషిగానే బయటికొస్తాను, అప్పుడే మాట్లాడతాను.. మళ్లీ అరెస్ట్‌పై జానీ మాస్టర్ రియాక్షన్

Jani Master: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లాంటివి కామన్ అని, అమ్మాయిలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉంటాయని ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం క్రియేట్ అయిపోయింది. కానీ వారికి జరుగుతున్న అన్యాయాల గురించి చాలా తక్కువమంది మహిళలు మాత్రమే ఓపెన్‌గా చెప్పి వారికి న్యాయం కావాలని పోరాడుతున్నారు. అలా ఒక బాధితురాలు ముందుకు రావడంతో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే అమ్మాయిని జానీ మాస్టర్ వేధించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్‌తో బయటికి వచ్చిన జానీ మాస్టర్ మళ్లీ అరెస్ట్ అవ్వక తప్పదని వార్తలు వస్తుండగా.. సోషల్ మీడియా వేదికగా వాటిపై స్పందించాడు.


న్యాయం ఉంది

జానీ మాస్టర్ బెయిల్ రద్దు, మళ్లీ అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో వీటిపై తాను స్పందించక తప్పలేదు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ట్విటర్‌లో ఒక వీడియో విడుదల చేశాడు జానీ మాస్టర్. ‘‘మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో వాటన్నింటికి నా తరపున ఒకటే సమాధానం ఇస్తాను. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది. అలా న్యాయం ఉంది కాబట్టే నేను బయటికొచ్చి నలుగురితో పనిచేసుకుంటున్నాను, నలుగురితో కలిసి హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉన్నాను’’ అంటూ ముందుగా బెయిల్ రావడంపై స్పందించాడు జానీ మాస్టర్.


Also Read: జానీ మాస్టర్ కి షాక్.. ఆరోపణలు నిజమే అంటూ తేల్చిన పోలీసులు..!

అది మాత్రమే తెలుసు

‘‘ఏం జరిగిందో నా మనసుకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. తర్వాత ఏంటి అనేది న్యాయస్థానం నిర్ణయిస్తుంది. నేను కోర్టు నుండి చాలా క్లీన్ చిట్‌తో బయటికొస్తాను. నిర్దోషిగానే బయటికొస్తాను. ఆరోజు మాట్లాడతాను. అప్పటివరకు నేను నిందితుడిని మాత్రమే. నాపై మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఉంటుంది. నాకు వచ్చిన పనితో బాగా కష్టపడడం, ఎంటర్‌టైన్ చేయడం మాత్రమే నాకు తెలుసు. నేనెప్పుడు నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికే మీ ముందుంటాను, దానికోసమే కష్టపడతాను. మీ ప్రేమ, ఆశీర్వాదం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్ (Jani Master).

కండీషనల్ బెయిల్

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నిందితుడు అని పోలీసులు ఇప్పటికే తేల్చారు. ఆయన విచారణ పూర్తయిన తర్వాత కండీషనల్ బెయిల్‌ను మంజూరు చేసింది కోర్టు. జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ముందుగా కొన్నిరోజుల పాటు తన ఫ్యామిలీతో ట్రిప్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేశాడు జానీ మాస్టర్. ఆ తర్వాత మళ్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అవ్వడం వల్ల తనకు అసలు పని దొరకడం లేదని రూమర్స్ వైరల్ అవ్వగా దానిపై కూడా తను స్పందించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో ఒక పాటను కొరియోగ్రాఫ్ చేశానని బయటపెట్టాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×