Gundeninda GudiGantalu Today episode December 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనికకు తాను తెచ్చిన సంబందించిన చెడిపోయినందుకు ప్రభావతి కోపంతో రగిలిపోతుంది. బాలుపై చేసుకొని దారుణంగా తిడుతుంది. ఇక బాలు మాత్రం గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు మీనా వచ్చి మీరు ఎందుకండీ అలా బాధపడుతున్నారు అనేసి అడుగుతుంది.. వాడు నిజంగానే మనిషి కాదు తాగినప్పుడే అలా కొట్టాడంటే ఇంక మనుషుల్ని ఏ రేంజ్ లో కొడతాడు ఆలోచించాలి కదా మీనా అనేసి అడుగుతాడు అంతలోకేం మౌనిక వస్తుంది. నేను నీతో గొడవ పడిన విషయం గురించి నాకు చెప్పాడు అన్నయ్య అనేసి మౌనిక అంటుంది ఇక సత్యం కూడా మౌనికను బాధ పెడుతున్నావా రా అనేసి అడుగుతాడు. ఇక మౌనిక ఇష్టం ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుందని చెప్పగానే బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజేష్ దగ్గరికి రాగానే పెళ్లిచూపులు అన్నావు కదరా అప్పుడే అయిపోయిందా అనగానే వాడికి ఎదవరా మొన్న బార్ల కొట్టాడు కదా వాడే అని వచ్చాడు. వాడి గురించి నిజం తెలుసుకోవాలని అనుకుంటాడు. నీలకంఠం దగ్గర పని చేస్తున్న డ్రైవర్ తో నిజం చెప్పించాలని అనుకుంటాడు. కానీ అతను రివర్స్ చెప్తాడు. ఇక బాలు షాక్ అవుతాడు. ఇక బాలుకు రమేష్ కనిపిస్తాడు. మళ్లీ నిజం చెప్తాడు. భయంతోనే చెప్పాలని అనుకుంటాడు. ఇక బాలు తాగేసి వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నీలకంఠం ఇంటికి ప్రభావతి సత్యం వెళతారు.. మా అబ్బాయి ఇలా చేసినందుకు మేం బాధపడుతున్నామండీ అనేసి అనగానే నేను మీరు ఇంత అవమానం చేస్తే క్షమిస్తానని అనుకున్నారా అని అంటాను అనుకున్నారు కదా కంగారు పడకండి బావగారు.. ఇంత జరిగినా కూడా నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని పటు బట్టి కూర్చున్నాడు.. అందుకే మీ సంబంధాన్ని ఇప్పటికీ మేము చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నామని నీలకంఠం చెప్పగానే ప్రభావతి సత్యం సంతోషపడతారు. ఇక బాలు నీలకంఠం ఇంటికి వెళ్తాడు. బయట గొడవ చేస్తారు అది గమనించిన సంజీవ్ బాలుని చూసి ఇంకాస్త గొడవలు పెట్టాలని ప్లాన్ చేస్తాడు.
నీలకంఠం నువ్వు బయటికి పిలుస్తాడు. డాడీ ఒక ముఖ్యమైన పని ఉంది బయటికి వెళ్దాం రండి అనేసి అంటాడు. ఆ బాలు గాడు వచ్చాడు వాడిని వీళ్ళ దృష్టిలో ఇంకాస్త చెడ్డవాడిగా చేయాలి అనేసి అంటాడు. బయటకొచ్చి నాటకాలు ఆడతారు. కావాలనే సత్యంకి వినిపించేలాగా అరుస్తారు అది వినగానే బయటకు వస్తారు సత్యం ప్రభావతి. గొంతు లాగే ఉందని బయటికి వచ్చి మాట్లాడుతారు. ఇక సత్యం ప్రభావితం చూసి బాలు షాక్ అవుతాడు ఇక్కడే నాన్న మీరు అనేసి అనగానే ఈ సంబంధాన్ని కలుపుకోవడానికి వచ్చామని ప్రభావతి అంటుంది.. బాలు మాత్రం వినకుండా సంజీవ్ మీద గొడవకు దిగుతాడు. సత్యం బాలు చెంప పగలగొడతాడు. ఇక బాలుని తీసుకెళ్ళమని తన ఫ్రెండ్ తో చెప్తాడు ఇక నీలకంఠం మనం ఇంట్లోకి వెళ్దాం రండి బావగారు అని లోపలికి తీసుకెళ్తాడు. ఇక లోపలికి వెళ్ళగానే మీ అబ్బాయి తాగొచ్చాడండి మీరు కాస్త ఆలోచించాల్సింది అలా కొట్టారు ఎంత బాధపడి ఉంటారో అనేసి అంటాడు.
ఈ విషయం అర్థమైంది బావగారు మా అబ్బాయి ఏమో మీ అమ్మాయినే కావాలనుకుంటున్నాడు మీ అబ్బాయి ఏమో ఈ పెళ్లిని ఎలాగైనా చెల్లగొట్టాలి అనుకుంటున్నారు మనం ఆలస్యం చేస్తే ఈ పెళ్లిని చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు వెంటనే ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసేద్దామని నీలకంఠమంటాడు. వెంటనే అంటే కష్టం బావగారు అని ఆలోచిస్తూ ఉంటారు కానీ సంజు మాత్రం మీరు ఏం పట్టించుకోవద్దు.. మా డాడి మొత్తం చూసుకుంటారు మీరు జస్ట్ పార్క్ వచ్చినట్టు రండి అనేసి అంటాడు. పంతులును పిలిపించి రెండు రోజుల్లో ముహుర్తాన్ని పెట్టిస్తారు. తర్వాత ఇంటికి వచ్చి బాలు చేసిన పని గురించి అందరూ బాలుని తిడతారు. పెళ్లి కాయమైందని తాంబూలాలు కూడా తీసుకున్నామని రెండు రోజుల పెళ్లిని సత్యం అందరితో చెప్తాడు. కానీ బాలు మాత్రం వాడొక దుర్మార్గుడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. బాలు మాటను ఎవరు వినరు ఇక మీనా కూడా సత్యం కు చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ మీనా పై చెయ్యెత్తుతాడు. ఇక బాలు మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రోజు ఉదయం ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెడతారు. మనోజ్ రోహిణి లు పెళ్లి పనులు చురుగ్గా పనిచేస్తారు. సత్యం పెళ్లి కార్డులను తీసుకొచ్చి ప్రభావతి ఇస్తాడు. సంజు ప్రభావతి కి ఫోన్ చేసి మౌనికకిస్తారని అడుగుతాడు. ఇక ప్రభావతి ఆనందం తట్టుకోలేక బాలు మీనాలను తోసుకొంటూ మౌనికకు ఫోన్ ఇస్తుంది. మౌనిక కూడా మంజుతో హ్యాపీగా ఫోన్ మాట్లాడుతుంది ఇక మీనా వచ్చేసి సంబంధం అందరికీ నచ్చిందండి మౌనిక కూడా చాలా సంతోషంగా ఉంది ఇక మీరు మీ ఆలోచనని మానుకోండి అని అడుగుతుంది. బాలు మాత్రం ఆ దుర్మార్గున్ని నా చెల్లికి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు మీనా అని బాధపడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..