Janvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన భారీ యాక్షన్ మూవీ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె పాత్ర తక్కువ సమయం ఉన్నా కూడా తన అందం, నటనతో బాగానే ఆకట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నటనకు ఫుల్ మార్కులు పడ్డాయ్.. ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందే వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. ఇక ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియా మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో పాటుగా తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది. తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇక దేవరతో జాన్వి టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు అమ్మడు తన నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెడుతుంది. దేవర 2 తో పాటు ఆర్సీ 16 సినిమాలో ఛాన్స్ పట్టేసింది అమ్మడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేయబోతుంది. అయితే ఈ సినిమాకు ఇటీవల కొబ్బరికాయ కొట్టారు. త్వరలోనే ఈ సినిమా బిజీగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది. ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో నటిస్తుంది. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా ఓ పోస్ట్ చేసింది.. జాన్వీ పాప ఫిట్నెస్ విషయంలో అస్సలు తగ్గదు.. ప్రత్యేకంగా జిమ్ చేసేందుకు టైం ను కేటాయిస్తుంది. అందుకే జీరో సైజ్ లో ఉంటుంది. స్లిమ్ గా ఉండాలని డైట్ చెయ్యాలి తప్పదు అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది.
ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే జాన్వి కపూర్ ఒక కప్ లో ఐఎస్ క్రీం తో కూడిన కుకీస్ ను చూపిస్తూ ఎవరైనా నన్ను ఆపేయమని చెప్పండి అంటూ కామెంట్ పెట్టింది. మన మనసుకి తినాలని ఒకవైపు అనిపిస్తున్నా మళ్లీ దీని వల్ల ఏదైనా శరరీ మార్పులు వస్తే కష్టమని తనకు తానుగా వద్దని చెప్పుకోలేక ఎవరైనా సరే వద్దని చెప్పండి అంటూ రాసుకొచ్చింది. కోట్లు కొద్దీ సంపాదించే వారు ఎలా పడితే అలా తింటారు.. ఏది కావాలంటే అది చేస్తారని అనుకుంటారు.. కానీ అందంగా కనిపించకుంటే ఆఫర్స్ పోతాయని ఆలోచిస్తారు. అందుకే కొన్ని రకాల ఫుడ్ విషయంలో నోరు కట్టేసుకుంటారు.. ఏది పడితే అది తినేసి శరీరంలో మార్పులకు కారణమవుతారు. మరి జాన్వి ఐస్ క్రీం ఎందుకు తినకూడదు అనుకుందో కానీ ఎవరైనా ఆపమంటే మాత్రం ఆపేస్తా అన్నట్టుగా చెప్పుకొచ్చింది.. మొత్తానికి ఆ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడంతో అయ్యో పాపం జాన్వీ పాపకు ఎంత కష్టం వచ్చిందో అని కామెంట్స్ చేస్తున్నారు.