ఆర్కే రోజారెడ్డి మంత్రి అవ్వాలన్న జీవిత కాల కోరిక తీర్చుకున్నారు. రెండేళ్లు మంత్రిగా పనిచేసిన ఆమె తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా మర్చిపోయారు . ఎన్నికల ఫలితాల వెలువడగానే ఆమె సెగ్మెంటుకు దూరమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మరో మాజీ హీరోయిన్ రవళితో కలిసి తిరుమల కొండపై ప్రత్యక్షమైన మాజీ మంత్రి రోజా అపచారం అని తెలిసి కూడా కొండ మీదే రాజకీయాలు మాట్లాడి మళ్లీ మాయమైపోయారు.
ఆమె ఎక్కడున్నారో ఎవరికీ అంతుపట్టనప్పటికీ.. ఉనికి చాటుకోవడానికి అన్నట్లు అప్పుడప్పుడు మీడియాకి వీడియోలు రిలీజ్ చేస్తూ హడావుడి చేస్తున్నారు . బెజవాడ వరదలప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గర నుంచి అందరూ వరద సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షిస్తుంటే.. అసలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రకటించి విమర్శల పాలయ్యారు. తర్వాత పుంగనూరులో బాలిక హత్య విషయంలోనూ లేనిపోనివి మాట్లాడి అభాసుపాలయ్యారు.
ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సహన మృతిపై రోజా మరో విడియో రిలీజ్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న జిల్లాలో, మహిళ హోంమంత్రి గా ఉన్న ఈ రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహన ను హత్య చెయ్యడం దారుణమని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యని ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎంలే కారణమని హావభావాలు ప్రకటించారు. అయితే ఆ హత్య చేసిన రౌడీ షీటర్ వైసీపీ సానుభూతిపరుడని అతని తల్లే అప్పట్లో ప్రకటించారు.
Also Read: నన్ను గెలక్కండి.. నేను నోరు తెరిస్తే.. బాలినేని మాస్ వార్నింగ్..
దాంతో మళ్లీ సోషల్ మీడియాలో రోజా అందరికీ ట్రోల్ అయ్యారు .అక్కడితో ఆగితే బాగుండేదేమో? కాని సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని.. సీఎం చంద్రబాబు, బాలకృష్ణలు అన్ స్టాపబుల్ రియాల్టీ షోలతో ఎంజాయ్ చేస్తున్నారని అప్పట్లో విమర్శలు గుప్పించారు. అక్కడే ఆమె అవగాహన లేమితో తప్పులో కాలేశారు. బాలకృష్ణ హోస్ట్‌గా, చంద్రబాబు గెస్ట్‌గా పాల్గొన్నఅన్‌స్టాపబుల్ రియాల్టీ షో ఎప్పుడో రికార్డ్ అయింది. అమె మాట్లాడే టైంకి దాని ప్రోమోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇవేమీ తెలియనట్లు రోజా ఆ షో గురించి మాట్లాడిన రోజా నెటిజన్లకు గట్టిగానే ట్రోల్ అయ్యారు. హీరోయిన్‌గా ఎక్స్‌పైర్ అయి పాలిటిక్స్‌లోకి వచ్చిన రోజా తర్వాత సంపాదన కోసం బుల్లితెరను నమ్ముకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆమె చాలా ఏళ్లు జబర్దస్త్ షోలకు జడ్జిగా డ్యాన్సులు కూడా చేశారు. ఆమె పొలిటికల్ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక టీవీ యాజమాన్యం జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి దింపేసింది.
మంత్రి అయ్యే వరకు ఇంకా కుర్ర హీరోయిన్‌లా టీవీ షోలో స్టెప్పులు వేసిన రోజా సంబంధంలేని ఇష్యూలో.. అదీ సబ్జెక్ట్ తెలియకుండా అన్‌స్టాపబుల్ షో గురించి, సీఎం చంద్రబాబు, బాలయ్యల గురించి మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు.నగరికి దూరమై చెన్నైలో భర్త సెల్వమణి కట్టించిన ఇంటికి షిప్ట్ అయిపోయిన రోజా .. తమిళ ఛానల్‌కి ఏదో రియాల్టీ షో షూటింగ్‌లో పాల్గొంటూ అక్కడ సంపాదనలో పడ్డారంట.
అక్కడ షూటింగ్‌కు బ్రేక్ తీసుకున్న రోజా తిరిగి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్లారు. స్వామి దర్శనానికి వచ్చిన ప్రతిసారీ ఆ మాజీ ఏదో ఒక అంశంపై రాజకీయం చేస్తూ వివాదాస్పదమవుతుంటారు. ఈ పాకి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్లిపోవడం హాట్ టాపిక్‌గా మారింది తిరుమల కొండపై రాజకీయ విమర్శలు ప్రసంగాలు చేస్తే కేసు పెడతామంటూ టీటీడీ పాలకమండలి హెచ్చరించిన నేపథ్యంలో.. ఆమె నోటికి తాళాం పడిందంటున్నారు.