BigTV English
Advertisement

CSK vs MI: హేమాహేమీల ఫైట్.. చెన్నైదే మ్యాచ్..

CSK vs MI: హేమాహేమీల ఫైట్.. చెన్నైదే మ్యాచ్..


CSK vs MI: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. హోమాహేమీల మ్యాచ్. అభిమానులంతా టీవీలు, ఫోన్ల ముందు అతుక్కుపోయారు. బాల్ టు బాల్ చూశారు. బాల్ టు బాల్ బెట్టింగులూ నడిచాయి. రెండు టఫ్ టీమ్స్‌లో ఎవరు గెలుస్తారా? అనే ఆరాటం. గ్రౌండ్‌లో పోరాటం మాత్రం పేలవం.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది ముంబై. ఆరంభంలోనే తుస్సు మనిపించారు బ్యాటర్స్. 14 పరుగులకే 3 వికెట్లు టపటపా పడ్డాయి. ఇక ముంబై పని ఖతం అనుకున్నారంతా. కామెరూన్‌ గ్రీన్‌ (6), ఇషాన్‌ కిషన్ (7)లు బ్యాట్లు ఎత్తేశారు. రోహిత్‌ శర్మ (0) డకౌట్. సూర్యకుమార్ ఉన్నాడుగా.. కొట్టేస్తాడులే అనుకుంటే.. మిస్టర్ 360 మాత్రం 26 రన్స్ చాలన్నట్టు ఔటయ్యాడు. నేహల్ వధేరా (64; 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీతో మెప్పించాడు. ట్రిస్టన్ స్టబ్స్‌ (20) పరుగులు చేశాడు. చివర్లో ఇరగదీస్తాడనుకున్న టిమ్ డేవిడ్ (2) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. మొత్తంగా 139/8 స్కోర్‌తో సరిపెట్టింది ముంబై ఇండియన్స్. చెన్నై బౌలర్లు పక్కాగా బౌలింగ్ చేశారు. పతిరాణా (3/15), దీపక్‌ చాహర్‌ (2/18) రాణించారు. తుషార్‌ దేశ్‌పాండే 2, జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు.


చెన్నైకు ఇదేమంత పెద్ద టార్గెట్ కాదు. అయినా, 17.4 ఓవర్లు పట్టింది గెలవడానికి. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించింది. సొంత మైదానం కావడంతో మరింత కలిసొచ్చింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డేవాన్‌ కాన్వే (44; 42 బంతుల్లో 4 ఫోర్లు), రుతురాజ్‌ గైక్వాడ్ (30; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆటాడుకున్నారు. అజింక్య రహానె (21), అంబటి రాయుడు (12)లు ఏదో ఆడేసి వెళ్లిపోయారు. శివమ్ దూబె మాత్రం 3 సిక్సులు బాది.. 17 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ధోని 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ముంబయి బౌలర్లలో పీయూష్‌ చావ్లా రెండు, ట్రిస్టన్‌ స్టబ్స్‌, ఆకాష్‌ మద్వాల్‌ చెరో వికెట్ తీశారు. మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×