Actress Jaya Lakshmi : తెలుగు బుల్లితెర పై పేరు తెలియని వాళ్లు ఉండరు. మొదట్లో యాంకర్ గా వ్యవహరించిన ఈమె సీరియల్స్ అలాగే సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపించే నటి జయలక్ష్మి పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో కూడా హైలెట్ అవుతుంది . తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఆమె మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.
జయలక్ష్మి కెరీర్..
సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చి చాలా గ్యాప్ తర్వాత యాంకర్‌గా మెరిశారు. వరుస సినిమా ఛాన్సులతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటుకున్నారు. సహజ నటనతో ఆకట్టుకునే నటి జయలక్ష్మి సీరియల్స్ టు సినిమాలతో ఫుల్ బిజీ మారింది. ఆ రోజుల్లో దూరదర్శన్‌లో వచ్చిన ‘హిమబిందు’ సీరియల్‌లో నటుడు అచ్యుత్ సోదరి పాత్రలో కనిపించారు జయలక్ష్మి. ఆ తర్వాత స్క్రీన్ మీద అంతగా ఆసక్తి లేక పెళ్లి చేసుకుని బ్రేక్ తీసుకున్నారు. పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యాక మళ్లీ బుల్లితెరపై కనిపించాలని ఆసక్తి కలిగింది. దాంతో యాంకర్‌గా కెరియర్ రీ స్టార్ట్ చేశారు. యాంకర్, యాక్టర్ గా బాగానే పాపులర్ అయ్యింది.. తాజాగా ఆమె మోహన్ బాబు గురించి సంచలన విషయాలను పంచుకుంది.
Also Read : బన్నీ వల్లే టాలీవుడ్ ఇండస్ట్రీ పతనం మొదలైంది.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్..
మోహన్ బాబుకు నో చెప్పడంతో సీరియస్..
సినిమా ఇండస్ట్రీలో సంతోషాన్ని పంచే అనుభవాలే కాదు చేదు అనుభవాలు కూడా చాలానే ఉన్నాయని చెప్పారు జయలక్ష్మి.. నేను ఓ మూవీలో మోహన్ బాబుతో కలిసి నటించాను. పైట జార్చే సీన్‌లో నటించాల్సి వచ్చిందట జయలక్ష్మి. అందుకు డైరెక్టర్లకు ఆమె ససేమిరా అని చెప్పడంతో మోహన్ బాబు టవల్‌తో ఎలా నటించాలో చెప్పి ఆ సీన్‌ను మేనరిజంలాగ చేయాలని చెప్పారట. తను ఆ సీన్ తను చేయనని చెప్పేయడంతో తనని పంపించేసి వేరే ఆర్టిస్ట్‌ని పిలిపించమని మోహన్ బాబు చెప్పారట. ఏ దాంట్లో కాంప్రమైజ్ అవని ఆయన ఇలాంటి విషయాల్లో ఎలా అవుతారని సంచలన విషయాలను పంచుకుంది. అదే విధంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతి రంగంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని ఏదైనా మన ప్రవర్తనని బట్టి ఉంటుందన్నారామె. తాను మూవీ ఛాన్స్‌ల కోసం ఎవరినీ అడగనని ఆమె అన్నారు. ప్రస్తుతం ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది. గతంలో ఈమె అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకోవడంతో ఆ వీడియోలు ఇప్పటికీ వైరల్గా మారాయి.
ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. రాజ్ తరుణ్ సినిమాల్లో ఈమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ మధ్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆమె నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.