Venuswamy : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా వరుస వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయినప్పటికీ ఆ సంతోషం మాత్రం అల్లు అర్జున్ లో లేదని చెప్పాలి. ఈ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కలాట ఘటన కారణంగా ఈయన ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత సక్సెస్ మీట్ లో కూడా ఆయన ఎక్కువగా మాట్లాడలేకపోయాడు. అయితే ఇప్పటికీ బన్నీ ఆ ఘటన నుంచి కోలుకోలేక పోతున్నాడు. అయితే అలాంటి బన్నీ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. వేణు స్వామి బన్నీ గురించి ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు. ఆయన ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం..
వేణు స్వామి ఇంటర్వ్యూ..
జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన.. ఒక్కమాట లో చెప్పాలంటే నాగ చైతన్య, సమంత విడిపోతారని చెప్పి పెద్ద బాంబ్ పేల్చాడు. మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన. వీళ్ళతో పాటుగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జీవితాల గురించి చెప్పి సంచలనాన్ని సృష్టించాడు. అయితే తాజాగా మరోసారి తన గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టాడు.
ఇంటర్వ్యూ లో ఏమన్నారంటే..?
ఉగాది సందర్బంగా అందరి జాతకాల గురించి బయటపెట్టిన ఆయన అల్లు అర్జున్ ఆల్రడీ జైలుకు వెళ్లొచ్చాడు. కొంత శని నుంచి విముక్తి కలిగింది. ఇక మీదట ఆయన జాతకం మారిపోతుంది. అని నిన్న మొన్నటివరకు చెప్పిన ఆయన ఇప్పుడు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ పతనానికి కారణం బన్నీనే కారణం అంటూ బాంబ్ పేల్చాడు. హైకోర్టు మొట్టికాయలు వేయడం తో మహిళా కమిషన్ కు క్షమాణలు కూడా చెప్పారాయన. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ల మధ్య విభేదాలు చోటు చేసుకుని, సమస్యలు వస్తాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. జాతకరీత్య త్వరలోనే వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం ఆయన ఫ్యాన్స్ పెదవిరుస్తున్నారు. అలా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బన్నీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..
ఇక పోతే బన్నీ సినిమాల విషయానీకోస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్, అట్లీ లతో సినిమాలు చేస్తున్నాడు. ముందుగా అట్లీతో సినిమా చేశాడు. ఆ మూవీ కోసం రంగం సిద్ధం చేశారు. త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారని టాక్. అలాగే ఈ ఏడాదిలోనే పూర్తి చేసి పుష్ప 3 మూవీ చెయ్యనున్నారని టాక్.. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.