BigTV English

Comedy Movie In OTT : న్యాయం కోసం పోరాడే యువకుడి స్టోరీ.. ఓటీటీలోకి తమిళ హిట్ మూవీ..

Comedy Movie In OTT : న్యాయం కోసం పోరాడే యువకుడి స్టోరీ.. ఓటీటీలోకి తమిళ హిట్ మూవీ..

Comedy Movie In OTT : ఓటీటీలోకి ఈ మధ్య కొత్త కంటెంట్ సినిమాలు విడుదలవుతున్నాయి. థియేటర్లలో నెగిటివ్ టాక్ ను అందుకున్నా కూడా ఇక్కడ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు సినిమాలు అనే కాదు డబ్ చేసిన సినిమాలు సైతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో మంచి వ్యూస్ ను అందుకొని దూసుకుపోతున్నాయి. ప్రతి వారం ఓటీటీలోకి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి సందడి చేస్తున్నాయి. ఇక తాజాగా తమిళ కామెడీ మూవీ ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తమిళ స్టార్ హీరో జయం రవి నటించిన రీసెంట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీ ఏంటి? స్ట్రీమింగ్ ఎక్కడ అనేది ఒకసారి తెలుసుకుందాం..


తమిళంలో అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా రిలీజైన మూవీ బ్రదర్. జయం రవి నటించిన ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయ్యింది. టీమ్ ఊహించని రీతిలో కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఇప్పుడీ మూవీ తెలుగు వెర్షన్ నేరుగా జీ 5 ఓటీటీలోకే వచ్చేసింది. జయం రవి బ్రదర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కేవలం తమిళ ఆడియోతోనే ఇన్నాళ్లూ అందుబాటులో ఉంది. తాజాగా తెలుగులోనూ ఈ సినిమాను తీసుకురావడం గమనార్హం.. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. అందులో చాలా వరకు యావరేజ్ టాక్ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. అందుకే చడి చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. మొన్నటివరకు తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. హీరో జయం రవి విడాకులు తీసుకున్న తర్వాత ఈ సినిమా వచ్చింది. దాంతో ఈ మూవీలోని సీన్ అందరు నిజమే అనుకున్నారు. కానీ ఇదొక మూవీ ఆయన 30 వ సినిమాగా ప్రేక్షకులను పలకరించింది. హ్యారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలు ప్రేక్షకులను అలరించినా.. మూవీ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. జయం రవి, ప్రియాంకా మోహన్ నటనకు మంచి మార్కులే పడినా.. స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలోనే నెగటివ్ రివ్యూలు వచ్చాయి.. సినిమా ఓపెనింగ్స్ దారుణంగా పడిపోయాయి..ప్రతి విషయంలోనూ న్యాయం కోసం ఫైట్ చేసే కార్తీక్ అనే యువకుడి చుట్టూ తిరిగే కథే ఈ బ్రదర్ మూవీ. అతని వల్ల తన పెద్దక్కతోపాటు కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతుంది. ఇందులో కార్తీక్ పాత్రలో జయం రవి బాగా నటించాడు.. ఆడియన్స్ కు కామెడీ అయితే ఇచ్చాడు కానీ పెద్దగా తన పాత్రతో మెప్పించలేదు. సినిమా మొత్తం ఆర్టిఫీషియల్ సీన్స్‌ తో డైలీ సీరియల్‌ ను తలపిస్తుంది. బ్రదర్ ఔట్‌డేటెట్ ఫ్యామిలీ డ్రామా మూవీ. డైలీ సీరియల్‌ను తలపించే ఎమోషన్స్‌, సీన్స్‌తో బోర్ కొట్టించాడని టాక్క.. కనీసం ఓటీటీలో అయిన మంచి టాక్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి..


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×