Jayam Ravi Divorce Case: కోలీవుడ్ హీరో జయం రవి , ఆర్తిల విడాకుల వార్తల్లో రోజుకొక మ్యాటర్ వెలుగు లోకి వస్తుంది.ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ లో మరొక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఇన్ని రోజులు తన భర్తతో విడిపోవడం తనకు ఇష్టం లేదని, తనకు చెప్పకుండానే విడాకులకు అప్లై చేశాడు అంటూ చెప్పిన జయం రవి భార్య ఆర్తి… తాజాగా తనకు నెలకు అన్ని లక్షల భరణం ఇస్తే విడాకులు ఇస్తాను అన్నట్లుగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో జయం రవి భార్య తీసుకున్న నిర్ణయానికి చాలామంది షాక్ అవుతున్నారు.మరి ఇంతకీ జయం రవిని భరణం కింద నెలకు ఎన్ని లక్షలు ఇవ్వమని ఆర్తి కోరింది.. ? జయం రవి ఆ డబ్బును ఇవ్వడానికి ముందుకు వస్తారా.. ?ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి?అనేది ఇప్పుడు చూద్దాం..
భరణం కింద అనే లక్షలు కావాలంటున్న ఆర్తి..
జయం రవి – ఆర్తి ల మధ్యలోకి సింగర్ కెనీషా రావడంతో మా మధ్య విభేదాలు వచ్చి విడాకుల వరకు వెళ్ళాము అంటూ తాజాగా ఒక సంచలన పోస్ట్ చేసింది ఆర్తి. అంతేకాదు మా మధ్య మూడో వ్యక్తి వచ్చినట్లు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని, ఆ మూడో వ్యక్తి ప్రమేయం వల్లే మా సంసార జీవితం నాశనమైంది అన్నట్లుగా ఆర్తి పోస్ట్ పెట్టింది.. దాంతో మరోసారి జయం రవి, కెనీషాల మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జయం రవి భార్య ఆర్తి విడాకులు వచ్చాక తనకు నెలకు 40 లక్షల రూపాయలు రవి మోహన్ భరణం కింద ఇవ్వాలి అని ఆర్తి తన పిటిషన్ లో రాసి కోర్టులో దాఖలు చేసింది.. ఇక ఆర్తి ఇచ్చిన పిటిషన్ ని పరిగణలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు ఆమె ఇచ్చిన పిటిషన్ పై జూన్ 12 లోపు రవి మోహన్ స్పందించాల్సిందిగా కోరారు..
ఆర్తి డిమాండ్స్ కి జయం రవి ఒప్పుకుంటారా..?
మరి దీనిపై రవి మోహన్ స్పందించి నెలకు రూ.40 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకుంటారా.. లేక సంపాదించిన ఆస్తిపాస్తులన్ని ఆర్తి, ఆమె కుటుంబ సభ్యులే లాక్కున్నారు అని డబ్బులు ఇవ్వడం కష్టం అని చేతులెత్తేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక తాజాగా కోలీవుడ్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ఆర్తితో విడాకులు వచ్చిన వెంటనే జయం రవి సింగర్ కెనీషా ని సాంప్రదాయబద్ధంగా రెండో పెళ్లి చేసుకోవాలి అని చూస్తున్నారట. దీనికి తోడు కెనీషా, జయం రవి ఇటీవల ఒక పెళ్లి వేడుకలో కూడా కనిపించి సందడి ఇక జయం రవి ఆ వీడియో చూసి పోస్ట్ పెట్టడంతో దీనికి కెనీషా ఎవరి దగ్గర అయితే మంచి హృదయం ఉంటుందో.. ఎవరి దగ్గర అయితే ప్రశాంతత ఉంటుందో వారి దగ్గరే ఉంటారు అంటూ కౌంటర్ ఇచ్చింది. మరి చూడాలి వీరి విడాకుల వ్యవహారం ఇంకా ఎక్కడి వరకు దారి తీస్తుందో.