Sanjiv Goenka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… లక్నో సూపర్ జెంట్స్ జట్టు ఓనర్ సంజీవ్ కు వచ్చిన కష్టం ఏ వ్యక్తికి కూడా రాకూడదు. అంతలా కష్టాల్లో ఉన్నాడు లక్నో ఓనర్ సంజీవ్. దీనికి కారణం లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కంటే ముందు మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో… టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్… వేలంలోకి రాగానే అతన్ని కొనుగోలు చేసేందుకు LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎగబడ్డాడు. కానీ ఇప్పుడు చేతులు కాల్చుకుంటున్నాడు LSG యజమాని సంజీవ్ గోయెంకా.
ALSO READ: IPL 2025 Playoffs: IPL మ్యాచులకు ఎక్స్‌ట్రా టైం పెంపు…ఇక రాత్రి 1:15 గంటల వరకు
తెలివిగా పంత్ ను తప్పించిన ఢిల్లీ ఓనర్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ మెగా వేలం సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్… గ్రంధి కిరణ్ కుమార్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఆయన.. మైండ్ సెట్ తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి కీలక ప్లేయర్లు వచ్చారు. 20 కోట్లకు పైగా వసూలు చేసిన ప్లేయర్లను కూడా… 15 కోట్ల లోపే ప్యాక్ చేసుకున్నారు ఢిల్లీ ఓనర్ గ్రంధి కిరణ్ కుమార్. అవతలి ఫ్రాంచైజీని.. ఇరుకున పెట్టి… చాలా తెలివిగా మంచి ప్లేయర్లను పిక్ చేసుకున్నారు.
ఇందులో భాగంగానే మొన్నటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ను తల భారం అనుకున్న ఓనర్ క్రాంతి కిరణ్ కుమార్… వెంటనే అతన్ని వదిలేసింది. అయితే మెగా వేలం సమయంలో పంత్ రేటు భారీగా పెరగడానికి కారణం కూడా గాంధీ కిరణ్ కుమార్ అని చెప్పవచ్చు. అతన్ని వదులుకోబోమని సిగ్నల్ ఇస్తూ రేటు పెంచే ప్రయత్నం చేశాడు గ్రంధి కిరణ్ కుమార్. అయితే కేఎల్ రాహుల్ ను వదిలించుకోవాలని లక్నో ఓనర్ సంజీవ్.. పంత్ కోసం మొగ్గు చూపాడు. దీంతో రిషబ్ పంత్ ధర ఒకసారిగా 27 కోట్లకు చేరుకుంది.
27 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే
27 కోట్లు పెట్టి రిషబ్ పంతును కొనుగోలు చేస్తే… ఒక మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడలేదు. లక్నో మొత్తం 12 మ్యాచ్లు ఆడితే… 135 పరుగులు మాత్రమే చేశాడు పంత్. 27 కోట్లు పెట్టుకుంటే ఒక్క మ్యాచ్లో కూడా సరిగ్గా ఆడలేదు. దీంతో పెద్ద దరిద్రుడు తన జట్టులోకి వచ్చాడని లక్నో ఓనర్… పదే పదే తిట్టుకుంటున్నాడట. గతంలో కేఎల్ రాహుల్ తరహాలో పంత్ ను తిట్టలేకపోతున్నాడు కానీ… లో లోపల మాత్రం కుమిలిపోతున్నాడట సంజీవ్. ఈ నేపథ్యంలోనే రిషబ్ పంత్.. లక్నో ఓనర్ సంజీవ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్నారు.
అద్భుతంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్
ఢిల్లీ జట్టులోకి వెళ్లిన కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్లో అదరగొడుతున్నాడు. తాజాగా సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు. గుజరాత్ పైన సెంచరీ తో దుమ్ము లేపాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం మాత్రం సంబరపడిపోతుంది. దరిద్రుడు పంత్ వెళ్ళిపోయాడు… జట్టు ప్లే ఆఫ్ కు వెళ్లేలా ఉంది అని ఎంజాయ్ చేస్తున్నారట.
?igsh=bTBwdmw2cHJ5NXZo