Jayam Ravi – Kenisha:రవి మోహన్ (Ravi Mohan)అలియాస్ జయం రవి(Jayam Ravi).. కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ నటి ఆర్తి(Arti)ని ప్రేమించి పెళ్లి చేసుకన్నారు. ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. పదేళ్లు వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్న వీరు.. అనూహ్యంగా విడాకులు అంటూ తెరపైకి వచ్చి సంచలనం సృష్టించారు. అటు ఆర్తికి విడాకులు తీసుకోవడం ఇష్టం లేకపోయినా ఆర్తితో తాను ఉండలేనని.. తనకు విడాకులు కావాలని జయం రవి కోర్టులో అప్లై చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే జయం రవి ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ (Kenisha fransis) తో ప్రేమలో ఉన్నాడని, అందుకే తనను దూరం పెడుతున్నాడని ఆర్తి ఆరోపించింది. ఆమె ఆరోపణలకు తగ్గట్టుగానే జయం రవి కూడా సింగర్ కెనీషాతో కలిసి పలు ఈవెంట్లకు హాజరవుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సింగర్ కెనీషా కూడా ఆర్తికి కౌంటర్ గా “మనశ్శాంతి ఎవరి దగ్గర అయితే ఉంటుందో.. మగవాడు వారి దగ్గరే ఉంటారు” అంటూ కౌంటర్ ఇచ్చింది.
రెండో పెళ్లి చేసుకున్న జయం రవి?
ఇలా అసలు ఇండస్ట్రీలో వీరి ముగ్గురు మధ్య ఏం జరుగుతోంది? అనే వాదోపవాదనలు నడుస్తున్న సమయంలోనే.. సడన్గా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు ఫోటోలు కనిపించి సంచలనం సృష్టిస్తున్నాయి. జయం రవి , సింగర్ కెనీషా ఇద్దరూ పూలదండలు వేసుకొని కనిపించారు. వాళ్ళిద్దరి మెడలో పూలదండలు కనిపించడంతో నిజంగానే రెండో పెళ్లి చేసుకున్నారా? అంటూ సోషల్ మీడియాలో అందరూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే ..చెన్నైలోని మురుగన్ దేవాలయంలో సింగర్ కెనీషా, జయ రవి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరి మెడలో పూలదండలు కనిపించాయి. పైగా పక్కనే పురోహితులు కూడా ఉన్నారు. దీంతో వీళ్లిద్దరికి పెళ్లి అయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇది చూసిన చాలా మంది విడాకులు మంజూరు కాకుండానే జయం రవి రెండో పెళ్లి ఎలా చేసుకుంటారు? అంటూ కామెంట్లు చేస్తుంటే, అసలు ఇది నిజమేనా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
అసలు నిజం ఏంటంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు. ఒక సినిమా షూటింగ్ నేపథ్యంలోనే గుడికి వెళ్ళగా.. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తే, అక్కడి పురోహితులు ఇలా వీరి మెడలో పూల దండలు వేశారట. అందుకే అది రెండో పెళ్లి కాదని చెబుతున్నారు. ఇక ఆర్తి విషయానికి వస్తే.. గత సంవత్సరం ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి ప్రకటించారు. ఇక ఎన్నో ఆరోపణలు పోరాటాల తర్వాత ఆర్తి తన భర్త నుంచి విడాకులు కావాలి అంటే, నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతున్నట్లు ఎక్కింది.
దీంతో వీళ్లిద్దరి విడాకులు అంశం ఇప్పుడు కోర్టు పరిధిలోనే కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే జయం రవి సడన్గా ఇలా కెనీషాతో కలిసి పూలదండలతో కనిపించడంతో ఈ విషయం కాస్త హార్ట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం ఆర్తి వరకు చేరితే ఆమె ఏదైనా స్పందిస్తుందా లేక ఈ విషయంపై అటు కెనీషా ఇటు జయం రవి ఏదైనా స్పందిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
#RaviMohan recently visited Kundrakudi Murugan temple and sought blessings..
Lord bless the couple 🙏 #JayamRavi #keneeshaa #Kollywood #rcbwin pic.twitter.com/rGlo2YshfR— Boxofficesutra (@BoxofficeSutra) June 4, 2025