
Guinness Record Dog : ఎవరైనా ఏదైనా కొత్తగా ట్రై చేస్తే.. దానిని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ గుర్తించి.. వారి పేరును రికార్డులో రాస్తుంది. వారిపేరుపై ఒక సర్టిఫికేట్ అందజేస్తుందన్న విషయం తెలిసిందే. మనుషులే కాదు.. జంతువులు కూడా గిన్నీస్ రికార్డులకెక్కుతాయి.
అలాగే .. ఈ శునకం తన వయసుతో గిన్నీస్ రికార్డుకెక్కింది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధశునకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. దీని పేరు బోబీ. వయసు 31. రఫీరో డో అలెంటెజో జాతికి చెందిన బోబీ శనివారం (అక్టోబర్ 21) పోర్చుగల్ లో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ప్రాణం విడిచింది.
బోబీ మరణించిందని వైద్యుడు డాక్టర్ కరెన్ బెకర్ వెల్లడించారు. ఈ స్వీట్ బాయ్ శనివారం రాత్రి నింగికేగాడు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా.. బోబీ 1992, మే 11న జన్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధికకాలం జీవించిన శునకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో గుర్తింపు పొందింది.
ఈ 31 సంవత్సరాలు బోబీ ఒకే కుటుంబంతో గడిపింది. కాగా.. 1939లో ఆస్ట్రేలియాకు చెందిన బ్లాయ్ అనే శునకం 29 సంవత్సరాల 5 నెలలు బతికింది. ఆ రికార్డును బోబీ అధిగమించింది.