BigTV English
Advertisement

Jayasudha Birthday : ఆనాటి మేటి నటి.. సహజనటి జయసుధ బర్త్డే స్పెషల్..

Jayasudha Birthday  : ఆనాటి మేటి నటి.. సహజనటి జయసుధ బర్త్డే స్పెషల్..
Jayasudha Birthday Special

Jayasudha Birthday : జయసుధ – ఈనాటి తరానికి ఒక సీనియర్ ఆర్టిస్టుగా మాత్రమే పరిచయం ఉన్న ఈ నటి ఒకప్పటి సూపర్ స్టార్. అందానికి తగిన అభినయంతో.. ఒకప్పటి స్టార్ హీరోలతో సమానంగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటిగా జయసుధ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఒకసారి మూవీలో క్యారెక్టర్ ఒప్పుకుంది అంటే ఇక ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉంది అని అర్థం.సహజంగా ఉండే ఆమె నటనను మెచ్చి అందరూ ఆమెను సహజనటి అని పిలిచేవారు.


జయసుధ డిసెంబర్ 17 1958లో మద్రాసులో జన్మించారు. ఆమె అసలు పేరు సుజాత. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టక ముందే ఆమెకు టాలీవుడ్ లో చాలామంది బంధువులు ఉండేవారు. ప్రముఖ నటి, దర్శకురాలు.. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల కు జయసుధ సమీప బంధువు. అందుకే 14 ఏళ్ల ప్రాయంలోనే ఆమెకు పండంటి కాపురం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.

మొదట చిన్న చిన్న పాత్రలతో తన కెరియర్ మొదలుపెట్టిన జయసుధకు ‘లక్ష్మణరేఖ, జ్యోతి’ మూవీలు నటిగా మంచి గుర్తింపు తెచ్చాయి. అంత చందాలతో అలరించడమే కాకుండా.. అద్భుతమైన నటనతో కట్టిపడేయడం ఒక్క జయసుధ కే సొంతం. నాటి మేటి సూపర్ స్టార్స్ అయిన యన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి యాక్టర్స్ అందరితో జయసుధ చిత్రాలు చేసింది. చంద్రమోహన్, మురళీమోహన్ లాంటి యాక్టర్స్ తో కూడా ఆమె పలు చిత్రాల్లో నటించింది.


ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాక నటించిన చివరి చిత్రం ‘నాదేశం’.. ఆయన నట జీవితంలో చివరిసారిగా విడుదలైన చిత్రం ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’.. ఈ రెండు చిత్రాలలో జయసుధ హీరోయిన్ కావడం విశేషం. అందుకే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో కూడా జయసుధకు ప్రత్యేకమైన సన్మానం చేశారు. ఏఎన్ఆర్ కాంబోలో జయసుధ నటించిన ప్రేమాభిషేకం, మేఘసందేశం, బంగారుకుటుంబం చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తేవడంతో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టాయి. విజయనిర్మల డైరెక్షన్లో కృష్ణ హీరోగా తెరకెక్కిన డాక్టర్ సినీ యాక్టర్.. మూవీలో మొదటిసారిగా ఆమె సూపర్ స్టార్ కృష్ణతో నటించింది. ఇక ఇద్దరు భార్యల మొగుడుగా శోభన్ బాబు ఎన్నో చిత్రాలు చేశాడు.. అలాంటి పలు చిత్రాలలో కచ్చితంగా అతని భార్య పాత్రలో ఒక పాత్ర జయసుధ చేసేవారు.

ఎక్కువగా విలన్ పాత్రలు చేస్తూ తన విలక్షణమైన నటనతో మంచి విలన్ గా వ్యవహరిస్తున్న మోహన్ బాబుకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిన గృహప్రవేశం మూవీలో హీరోయిన్ కూడా జయసుదే. ఆ తర్వాత ఆ జనరేషన్ లో కుర్ర హీరోలుగా ఉన్న.. చిరంజీవితో ఇది కథ కాదు ,బాలకృష్ణతో అధినాయకుడు.. సినిమాలలో హీరోయిన్ నటించి మెప్పించింది జయసుధ.

తెలుగు తో పాటు తమిళ్ ,కన్నడ ,మలయాళం, హిందీ ఇండస్ట్రీలలో కూడా తన ప్రతిభ కనబరిచి మంచి గుర్తింపు తెచ్చుకుంది జయసుధ. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో…నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి ‘జె.కె. ఫిలిమ్స్’పతాకంపై పలు చిత్రాలను నిర్మించింది. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా తన లక్ ట్రై చేసిన జయసుధ 2009లో సికింద్రబాద్ నియోజకవర్గం నుండి గెలిచి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగుపెట్టింది కానీ 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక ఆ తర్వాత రాజకీయాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి సినిమాలలో తనకు వచ్చిన మంచి పాత్రలను చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

.

సహజనటికి బిగ్ టీవీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×