BigTV English
Advertisement

JD Chakravarthy: చిరంజీవి.. పరమ దుర్మార్గుడు.. 8 రోజులు అలా..

JD Chakravarthy: చిరంజీవి.. పరమ దుర్మార్గుడు.. 8 రోజులు అలా..

JD Chakravarthy: మెగాస్టార్  చిరంజీవి.. టాలీవుడ్ ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు ఆయన పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొణిదెల శివ శంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన విధానం ఎంతోమందికి ఆదర్శం. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి ఎదగాలన్న ప్రతి నటుడుకు చిరంజీవినే ఆదర్శం. ఇప్పుడొచ్చే యంగ్ జనరేషన్ హీరోను ఎవరిని అడిగిన తన ఇన్స్పిరేషన్ చిరంజీవినే అని చెప్తారు.


ఇంత పేరు చిరంజీవికి అంత ఈజీగా రాలేదు. ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో అవమానాలను, అడ్డకనులను దాటుకొని మెగాస్టార్ గా ఎదిగారు. ఆయన గురించి చెప్పాలంటే.. మాటలు సరిపోవు.  ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు.. చిరంజీవి కష్టం గురించి చెప్తూనే ఉంటారు. ఆయన చేసిన సాయాలు.. దానాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో హీరో జేడీ చక్రవర్తి.. చిరంజీవి కష్టం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చిరంజీవి పని రాక్షసుడు అని, డైరెక్టర్ చెప్పకముందే షాట్ లో ఉండడం కోసం నిద్ర కూడా మానుకొనేవారని తెలిపాడు. తాజాగా మరోసారి అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ గా  మార్చారు.

” చిరంజీవి గారు.. నేను చెప్తున్నాను అని కాదు..  దుర్మార్గుడు.. పరమ దుర్మార్గుడు. నేను అంతం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో.. ఆయన ఘరానా మొగుడు అనే సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. 8 రోజులు కంటిన్యూ షూటింగ్. యూనిట్ మారింది.. ఫైటర్స్  మారుతున్నారు. హీరో మారడం లేదు. 8 రోజులు ఆయన అంబాసిడర్ కారులో బయట పడుకున్నారు. నేను ఆగలేక వెళ్లి అడిగాను. ఏవండీ.. అక్కడ మేకప్ రూమ్ ఉంది కదా. అందులో పడుకోవచ్చు కదా .. మీరు ఇలా పడుకోవడం నచ్చడం లేదు. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ ను.. ఆయనను అలా చూడలేక అడిగాను.  దానికి చిరంజీవి గారు చెప్పిన లాజిక్ విని నేను షాక్ అయ్యాను.


ఏం లేదండీ.. ఇప్పుడు నేను లోపల పడుకున్నాను అంటే మోహన్ లేపడు నన్ను.  బయటే పడుకున్నాను అనుకోండి.. యాక్షన్..  రెడీ.. రెడీ.. రెడీ.. చిరంజీవి గారిని పిలవండి అనగానే లేచి వెళ్లిపోతున్నా.. ఆ గ్యాప్ కూడా ఇవ్వకూడదు అని అన్నారు. ఆయన పెద్ద పని రాక్షసుడు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు.. మెగాస్టార్ అక్కడ.. అంత నిబద్దతతో పని చేశాడు కాబట్టే ఇప్పుడు ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక జేడీ చక్రవర్తి గురించి చెప్పాలంటే.. శివ సినిమాలో ఒక విలన్ గా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాడు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి.. మనీ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో  జేడీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. గులాబీ, బొంబాయి ప్రియుడు, సత్య, అనగనగా ఒక రోజు.. ఎన్నో మంచి సినిమాలలో నటించి మెప్పించాడు. కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక చాలా గ్యాప్ తరువాత గతేడాది దయ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సిరీస్ మంచి విజయాన్నే అందుకుంది. త్వరలోనే ఈ సిరీస్  సీజన్  2 రానుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×