E-Paper
Advertisement

Defamation Case : చిరంజీవిపై విమర్శల కేసు.. జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష..

Defamation Case : చిరంజీవిపై విమర్శల కేసు.. జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష..
Advertisement

Defamation Case : పరువునష్టం కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్‌ దంపతులకు షాక్ తగిలింది. వారికి నాంపల్లిలోని 17వ అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. రాజశేఖర్, జీవిత దంపతులు 2011లో చిరంజీవి బ్లడ్‌బ్యాంకుపై అనేక ఆరోపణలు చేశారు. దాతల నుంచి ఉచితంగా సేకరించిన బ్లడ్ ను మార్కెట్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

రాజశేఖర్ , జీవిత దంపతులు చేసిన ఆరోపణలపై సినీ నిర్మాత అల్లు అరవింద్‌ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న ట్రస్టు సేవలపై అసత్య ఆరోపణలు చేశారని పేర్కొంటూ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించడంతో అప్పీ ల్ కు అవకాశమిచ్చింది. రాజశేఖర్‌ దంపతులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ కూడా మంజూరు చేసింది.

Advertisement

ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో చిరంజీవి, రాజశేఖర్ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ సమయంలో పీఆర్పీపై రాజశేఖర్ కామెంట్స్ చేయడంతో మెగా అభిమానులు ఆయన వాహనాన్ని వెంబడి దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో చిరుపై రాజశేఖర్ దంపతులు విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలో 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వహణపై ఆరోపణలు చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×