BigTV English

Sriramana : ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూత.. టాలీవుడ్ లో విషాదం..

Sriramana : ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూత.. టాలీవుడ్ లో విషాదం..

Sriramana : ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూశారు. 70 ఏళ్ల ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వేకువజామున 5గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు బాపు, రమణతో కలిసి శ్రీరమణ పనిచేశారు.


మిథునం సినిమా శ్రీరమణకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. తనికెళ్ల భరణి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఆయన కథ అందించారు. 2012లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది.

శ్రీరమణ గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబర్ 21న జన్మించారు. ఆయన అసలు పేరు కామరాజ రామారావు. రచయితగా శ్రీరమణ తనదైన ముద్ర వేశారు. పేరడి రచనలు ఆయనకు ఎంతో పేరుతెచ్చాయి. ఆయన పలు తెలుగు దిన పత్రికల్లో పని చేశారు. నవ్య వార పత్రికకు ఎడిటర్‌గా శ్రీరమణ కొంతకాలం పనిచేశారు. కాలమిస్టుగా, కథకుడిగా, సాహిత్య, కళా రంగాలకు విశిష్ట సేవలందించారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.


Related News

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Big Stories

×