BigTV English

Divorce : 37 ఏళ్ల వైవాహిక బంధానికి బ్రేక్… విడాకుల బాట పడుతున్న సీనియర్ హీరో

Divorce : 37 ఏళ్ల వైవాహిక బంధానికి బ్రేక్… విడాకుల బాట పడుతున్న సీనియర్ హీరో

Divorce : ఇటీవల కాలంలో సెలెబ్రిటీలు విడాకుల బాట పడుతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ సీనియర్ హీరో ఏకంగా పెళ్లయిన 37 ఏళ్ల తర్వాత తన భార్యకి డివోర్స్ ఇవ్వబోతున్నారన్న వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆ హీరో మరెవరో కాదు గోవిందా (Govinda). మరి ఈ జంట మధ్య ఏం జరుగుతోంది? ఎందుకు విడాకులు తీసుకోబోతున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే…


భార్యకు విడాకులు ఇవ్వ బోతున్న గోవింద?

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద గురించి మూవీ లవర్స్ కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 90ల కాలంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఈ హీరో బ్లాక్ బస్టర్ సినిమాలతో హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న గోవిందా ఆయన భార్య సునీత అహుజా (Sunita Ahuja)కు విడాకులు ఇవ్వబోతున్నట్టుగా వార్తలు గుప్పుమంటున్నాయి.


37 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ జంట అధికారికంగా డివోర్స్ తీసుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తలపై ఇప్పటిదాకా ఈ దంపతులు స్పందించలేదు. నిజానికి గోవిందా – సునీత తమ పర్సనల్ లైఫ్ ను ప్రైవేట్ గా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఇక వీరిద్దరూ ఎప్పుడైనా కలిసి బయట కనిపిస్తే చాలు జనాలు ఆశ్చర్య పోవాల్సిందే. అలాంటిది ఈ జంట ఇటీవల కాలంలో తమ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులను ఫేస్ చేస్తున్నట్టుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

గత కొంతకాలం నుంచి గోవింద, తన భార్య విడివిడిగా నివసిస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ డివోర్స్ తీసుకోబోతున్నారు అన్న వార్తలు బయటకు రావడం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక వీళ్లిద్దరూ డివోర్స్ తీసుకోవడానికి కారణం తరచుగా గొడవలు జరగడం, ఒకరి లైఫ్ స్టైల్ మరొకరికి నచ్చకపోవడం వంటి విషయాలే అంటున్నారు.

ఆ హీరోయిన్ తో ఎఫైర్ కారణమా?

అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు 30 ఏళ్ల మరాఠి హీరోయిన్ తో గోవిందా సన్నిహితంగా ఉంటున్నాడని, అందుకే అతని భార్య సునీత అహుజా డివోర్స్ తీసుకోవడానికి సిద్ధమైందని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది? అనే వార్తలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఏడాది మొదట్లోనే సునీత తన భర్త గోవిందతో కలిసి ఒకే ఇంట్లో నివసించట్లేదు అన్న వార్తలు బయటకు వచ్చాయి.

గోవిందా తన ఇంట్లోనే నివసిస్తుండగా, తన ఇంటికి ఎదురుగా ఉన్న మరో ఇంట్లో ఆయన భార్య పిల్లలు ఉంటున్నారని అంటున్నారు. ఇక ఇటీవలే సునీత తన పుట్టినరోజును ఒంటరిగా జరుపుకోవాలని ఇష్టపడతానని చెప్పడం వారి డివోర్స్ రూమర్లకు దారి తీసింది. మరి వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందన్న విషయం తెలియాలంటే గోవిందా లేదా ఆయన భార్య సునీత అహుజా నోరు విప్పే దాకా ఆగాల్సిందే. మరి ఈ దంపతులు విడాకుల వార్తలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అనేది చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×