Rs.500 Notes : పొలంలో పంట ఎలా ఉందో చూద్దాం అని వెళ్లిన ఓ రైతులకు వింత అనుభవం ఎదురైంది. మంచి పంట పండింతే.. దాన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. కానీ.. ఈ రోజు మాత్రం ఆ రైతుకు.. నేరుగా పొలమే నోట్లు పండించిందా అన్నంత ఆశ్చర్యం వేసింది. పది రూపాయల నోటు కూడా మర్చిపోకుండా, జాగ్రత్తగా పట్టుకెళ్లే మనుషుల మధ్య.. తన పంట పొలంలో నోట్ల కట్టలు కుమ్మరించి వెళ్లారు. కళ్ల నిండుగా కనిపించిన లక్ష్మి దేవీని చూసి ఆశ్చర్యపోయిన రైతు.. ఆశగా దగ్గరకు వెళితే కానీ విషయం తెలియలేదు. అంతలోనే ఆశపెట్టిన ధనలక్ష్మీ.. అప్పటికప్పుడే అబద్ధం అని తెలిసి కంగుతిన్నాడు. ఇక పోలీసులు సైతం ఎంట్రీ ఇవ్వడంతో.. ఏం జరుగుతోందిరా దేవుడా.. అనుకునే పరిస్థితి ఎదురైంది. ఇంతకీ ఏం జరిగింది అంటే..
నల్గొండ జిల్లాలోని దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు.. రోజులానే పొలానికి వెళ్లాడు. అలా అడుగుపెట్టాడో లేదో.. నోట్ల కట్టలు తళుక్కున కంటిలో పడ్డాయి. ఆహా.. నా జీవితం మారిపోయిందిపో.. అనుకుని, దగ్గరకు వెళ్లి చూశాడు. అన్నీ రూ.500 నోట్ల కాగితాలే. నోట్ల కాగితం రంగు నుంచి, పేపర్ క్వాలిటీ వరకు ఎక్కడా డౌట్ రాలేదా పెద్ద మనిషికి. ఇంకేముంది.. ఆ రోజుకు తన జన్మధన్యం అయ్యిందని, నోట్ల కట్టలతో కష్టాలు తీరిపోయినట్లే అనుకున్నాడు. కానీ.. కాసేపటి కానీ అసలు విషయం బోధపడలేదు. ఆ నోట్ల కట్టలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట.. చిల్ట్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది. అంతే.. ఆ విషయం తెలిసి షాక్ అవ్వడం రైతు పనైంది.
ఎవరో ఫేక్ నోట్లను కట్టలకు, కట్టలు తీసుకొచ్చి పొలంలో పోసినట్లు గుర్తించారు. సుమారు రూ.20 లక్షల మేరకు నోట్లను ముద్రించిన దుండగులు.. వాటిని అచ్చమైన నోట్లకు సరిసమానంగా ముద్రించారు. వాటిలో బ్యాంక్ ఆఫ్ చిల్డ్రన్ అనే అక్షరాలు లేకుండా ఉంటే.. వాటిని గుర్తుపట్టలేనంతగా అసలైన వాటిలా ఉన్నాయంటున్నారు.. బొత్తలపాలెం గ్రామానికి చెందిన రైతులు. విషయం ఆ నోటా, ఈ నోటా పడి చివరికి పోలీసులకు చేరడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. దొంగనోట్ల కట్టలపై దృష్టి సారించారు. ఎవరు ఇలాంటి పనులకు పాల్పడ్డారో తెలుసుకునే పనిలో పడ్డారు.
అసలు.. డబ్బుల నోట్లను ముద్రించాల్సిన అవసరం ఎందుకొచ్చింది.? ఆ నోట్లను ఎలా ముంద్రించారు.? అనే విషయాల్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే.. స్థానికంగా ఓ యువకుల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని విచారించి.. త్వరగా అసలు విషయాలు రాబట్టాలని చూస్తున్నారు. ఇవేనా.. ఇలాంటి నోట్లు ఇంకా ఏమైనా ముద్రించారా.? ఎప్పుడైనా దొంగ నోట్లు చలామణిలోకి తీసుకొచ్చారా.? తీసుకొస్తే.. ఎంత మొత్తం డబ్బుల్ని అలా ముంద్రిచారు.? ఇలా అనేక విషయాల్లో స్పష్టత రాబట్టాలనుకుంటున్నారు.