Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ ఈనెల 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న ఈ సినిమా యూత్ ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది. బెస్ట్ కాన్సెప్ట్ తో పాటు సమాజానికి మేలు చేసే విధంగా ఈ సినిమా స్టోరీ ఉందని ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ మూవీపై జానీ మాస్టర్ కొడుకు తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు.
గేమ్ చేంజర్.. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా స్టోరీతో పాటు చరణ్ పాత్ర అద్భుతంగా ఉందని ఇప్పటికే పలువురు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా యూత్ కు ఎంతగానో ఉపయోగపడే కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చిందని.. ఒక మంచి కాన్సెప్ట్ ను సమాజానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారంటూ ఎందరో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా స్టోరీ పై స్పందించిన జానీ మాస్టర్ కొడుకు శ్రీరాజ్.. గేమ్ ఛేంజర్ మూవీ అద్భుతంగా ఉందని తెలిపాడు.
“ఎడ్యుకేషన్ తో పాటు సొసైటీలో జరిగే విషయాలను చాలా క్లియర్ గా చూపించారు. చాలా మంది రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం ప్రజలకు సేవ చేయకుండా సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇలాంటివి జరగకుండా హీరో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సొంతగా ఒక పార్టీని స్థాపించి.. ఎలాంటి డబ్బులు పంచకుండా న్యాయంగా పనిచేస్తాడు. సినిమా అంతా జస్టిస్ కోసమే ఉందని.. సినిమాలో రామ్ చరణ్ కు కోపం ఎక్కువగా ఉంటుందని అయితే ఈ కోపం కూడా న్యాయంగా కనిపిస్తుందన్నాడు. సరైన సమయంలో న్యాయం కోసం జరిగే పోరాటంలో చూపించే కోపం కూడా న్యాయమేనని.. ఒక సాధారణ వ్యక్తి కోపాన్ని ఎవరూ పట్టించుకోరని.. కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ లో చూపించే కోపానికి సరైన రైట్ ఉంటుందని మనకి ఈ సినిమా చెప్తుంది..” అంటూ తెలిపాడు.
The Young Gen is watching!!
Hear out to the honest response of my son #Siraj about #GameChanger ❤️
The impact of @AlwaysRamCharan Anna's performance & @shankarshanmugh's awakening vision will stay with us💥
Go watch it with your family in theaters today 🤩 @SVC_official pic.twitter.com/g2yVp40AVo
— Jani Master (@AlwaysJani) January 13, 2025
“ఫైటింగ్స్, సాంగ్స్ లో చూస్తే వల్గర్ సీన్ ఒక్కటి కూడా లేదు. ఒక క్లాస్ సెషన్ లా చూడటానికి ఎంతో డీసెంట్ గా ఉంది. సినిమాలో క్లియర్ గా అడ్మినిస్ట్రేషన్ ఏం చేయగలదో చూపించారు. ఐఏఎస్ కు ఎలాంటి పవర్స్ ఉన్నాయి.. ఐపీఎస్ కు ఎలాంటి పవర్స్ ఉన్నాయి అనే విషయాన్ని చూపించారు. ఇప్పటి జనరేషన్ పిల్లలకి ఇలాంటి సినిమాలు చాలా అవసరం. అసలు సర్వీసెస్ ఎలా ఉన్నాయో నెక్ట్ జనరేషన్ కి చూపించటానికి ఈ సినిమా కరెక్ట్. ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలన్నీ పొడుచుకోవటం, తగాదాలు పడటాన్నే చూపిస్తున్నాయి. కానీ గేమ్ ఛేంజర్ ఇందుకు భిన్నం. ఇలాంటి సినిమాలు చూస్తే చాలా అవగాహన వస్తుంది. డైరెక్టెర శంకర్ ఆలోచనకు హ్యాట్సాఫ్.. ఆయనకి అసలు అలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయో తెలియటం లేదు. శంకర్ ఆలోచనలకు తగినట్లు రామ్ చరణ్ సైతం అద్భుతంగా నటించారు. సినిమా ఒక యూనిక్.. తప్పకుండా అందరూ చూడాల్సిందే..” అంటూ ఈ చిన్నోడు తన బెస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.
ALSO READ : డైరెక్టర్ పై మహిళా కమిషన్ ఫైర్… త్వరలో సీరియస్ యాక్షన్